బొత్స సత్యనారాయణ వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బొత్స సత్యనారాయణను మంత్రి వర్గంలోకి తీసుకున్న సీఎం జగన్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను అప్పగించారు. అయితే 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో బొత్సకు విద్యా శాఖను కేటాయించారు.
వ్యక్తిగత జీవితం
విజయనగరంలో గురునాయుడు, ఈశ్వరమ్మలకు 1958లో బొత్స సత్యనారాయణ జన్మించారు. మహారాజా డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. 1985లో ఝాన్సీ లక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఝాన్సీ లక్ష్మి 2006లో బొబ్బిలి నుంచి, 2009లో విజయనగరం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నరసయ్య వైఎస్ఆర్సీపీ నాయకుడు.
రాజకీయ జీవితం
బొత్స సత్యనారాయణ తొలిసారిగా 1999లో బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. అప్పట్లో ఎన్డీఏ హవా వల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కేవలం 5 ఎంపీలని గెలుచుకోగా అందులో బొత్స ఒకరు. 2004, 2009లలో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవులు కూడా చేపట్టారు. భారీ పరిశ్రమల శాఖ, పంచాయతీ రాజ్ గృహ నిర్మాణ శాఖ, రవాణా, మార్కెటింగ్ శాఖ మంత్రిగా గతంలో పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
కాంగ్రెస్కు రాజీనామా..
2015లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బొత్స సత్యనారాయణ తన కుటుంబం, మద్దతుదారులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. 2019లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
| లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Male | 66 | 0 | Cabiner Minister of Govt. of AP(Politician) | Graduate | 21 Cr+ | 4 Cr+ | 8Cr+ | 12Cr+ | 8 Lacs+ |
| S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
