Share News

మరో 10 రోజులు ఎండలే

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:39 AM

వర్ష రుతువులోకి ప్రవేశించి నెల రోజులు దాటుతున్నా.. మేఘాల దోచూబులాట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఎండలు దంచి కొడుతున్నాయి. మరో పది రోజుల పాటు..

మరో 10 రోజులు ఎండలే

  • 22 తర్వాతే మంచి వర్షాలు

  • ఏడు జిల్లాలు మినహా అంతటా లోటే

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): వర్ష రుతువులోకి ప్రవేశించి నెల రోజులు దాటుతున్నా.. మేఘాల దోచూబులాట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఎండలు దంచి కొడుతున్నాయి. మరో పది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణుల అంచనా. ఎల్‌నినో కారణంగా వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్‌ మాదిరిగా ఎండలు కాస్తున్నాయి. ఈ నెల 15 వరకు పూర్తి పొడి వాతావరణం ఉంటుందని తెలంగాణ వెదర్‌మ్యాన్‌ బాలాజీ తెలిపారు. 16 నుంచి 19వ తేదీ మధ్యన అక్కడక్కడ తేలికపాటి వర్షాలు.. 22-30 మధ్య తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరోవైపు రాష్ట్రంలో 7 జిల్లాలను మినహాయిస్తే మిగిలిన అన్నింటా లోటు వర్షపాతమే నమోదైంది. ఈ నెలలో 8 సెం.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 4 సెంటీమీటర్ల వానే కురిసింది.

Updated Date - Jul 13 , 2026 | 04:40 AM