వివేకా హత్య కేసులో సునీత పిటిషన్ విచారణకు స్వీకరణ
ABN , Publish Date - Apr 28 , 2026 | 04:39 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో లోతైన దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను...
నిందితులకు ప్రతులివ్వాలని సీబీఐ కోర్టు ఆదేశం
తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో లోతైన దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. దీని ప్రతులను ఈ కేసులోని నిందితులందరికీ అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారాని(30వ తేదీ)కి వాయిదావేసింది. కేసులో మరింత లోతైన దర్యాప్తు చేయాలని గతంలో సునీత పిటిషన్ వేయగా.. పాక్షిక విచారణకు మాత్రమే సీబీఐ కోర్టు అనుమతించింది. అదనంగా తెలిసిన అంశాలేవీ లేవంటూ సీబీఐ మూడో చార్జిషీటును దాఖలు చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో జగన్ పాత్ర ఏంటి.. వివేకా మరణ సమాచారం వారికి ముందుగానే ఎలా తెలిసింది అన్న కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేలా ఆదేశించాలని సునీత అభ్యర్థించారు.