Share News

నేడు మీసేవ వాట్సా్‌పలో డీఈఈసెట్‌ హాల్‌టికెట్లు

ABN , Publish Date - May 15 , 2026 | 05:02 AM

డీఈఈసెట్‌ హాల్‌టికెట్లను మీసేవ వాట్సాప్‌ ద్వారా అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు...

నేడు మీసేవ వాట్సా్‌పలో డీఈఈసెట్‌ హాల్‌టికెట్లు

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): డీఈఈసెట్‌ హాల్‌టికెట్లను మీసేవ వాట్సాప్‌ ద్వారా అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు మే 15న ఉదయం 10 గంటల నుంచి తమ హాల్‌ టికెట్లను వాట్సాప్‌ ద్వారా సులభంగా పొందవచ్చని వారు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డీఈఈసెట్‌ పరీక్షలు ఈ నెల 21, 22 తేదీల్లో జరగనున్నాయి. వాట్సాప్‌ నెంబర్‌ 8096958096 ద్వారా విద్యార్థులు డీఈఈసెట్‌ హాల్‌ టికెట్లను పొందవచ్చు. ఈ సేవతో విద్యార్థులు, తల్లిదండ్రులకు పరీక్షలకు సంబంధించిన సేవలు వేగంగా, సులభంగా అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - May 15 , 2026 | 05:02 AM