రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా
ABN , Publish Date - Sep 18 , 2026 | 05:56 AM
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు క ల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 19న సూర్యాపేట జిల్లా కోదాడలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
హాజరుకానున్న 300 కంపెనీలు
3వేల మందికి ఉద్యోగ అవకాశాలు: ఉత్తమ్
సూర్యాపేట, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు క ల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 19న సూర్యాపేట జిల్లా కోదాడలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ జాబ్‌మేళాకు రాష్ట్రంలోని 300 ప్రముఖ కంపెనీలు హాజరవుతున్నాయని, ఈ సువర్ణావకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్‌మేళాకు సుమారు 20వేల మంది హాజరుకానున్నారని, సుమారు 3వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. జాబ్‌మేళాకు 18ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయసున్న యువతీ,యువకులు మాత్రమే హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రత్యేక వెబ్‌సైట్
((www.kodadmegajobmela.com)