Share News

రేపు ఖమ్మంలో జనసేన శంఖారావం

ABN , Publish Date - Sep 12 , 2026 | 04:40 AM

తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా ఆదివారం ఖమ్మం గడ్డపై జనసేన ఉమ్మడి ఖమ్మంజిల్లా శంఖారావ సభ నిర్వహిస్తున్నట్లు జనసేన నేత, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు తెలిపా

రేపు ఖమ్మంలో జనసేన శంఖారావం
GADALAsRINIVASARAO PRESS CONFERENCE

తెలంగాణలో ప్రత్యామ్నాయం జనసేననే: గడల శ్రీనివాసరావు

ఖమ్మం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా ఆదివారం ఖమ్మం గడ్డపై జనసేన ఉమ్మడి ఖమ్మంజిల్లా శంఖారావ సభ నిర్వహిస్తున్నట్లు జనసేన నేత, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా జనసేన విస్తరించబోతుందన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 04:40 AM