నేడు పరేడ్‌గ్రౌండ్స్‌లో విమోచనం
ABN , Publish Date - Sep 17 , 2026 | 02:57 AM
హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన రోజు సందర్భంగా గురువారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు.
ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
గవర్నర్ శుక్లా శుభాకాంక్షలు
నేడు పరేడ్‌గ్రౌండ్స్‌లో
విమోచన దినోత్సవం
ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన రోజు సందర్భంగా గురువారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా, రాష్ట్ర గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అతిథులుగా హాజరవుతున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు కూడా హాజరుకానున్నట్టు వెల్లడించారు.
ఇది చరిత్రాత్మక సందర్భం: గవర్నర్ శుక్లా
హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. 1948సెప్టెంబర్17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చరిత్రాత్మక సందర్భమిదని పేర్కొన్నారు. నాటి ప్రజల పోరాటాలను, త్యాగాలను కృతజ్ఞతతో స్మరించుకోవాలని, నాటి ఘట్టాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.