కొత్తకోట మున్సిపల్ చైర్మన్‌గా అరుణ శ్రీనివాస్.. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ జోరు
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:22 PM
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో నూతన చైర్మన్ పట్టాభిషేకం ఖరారైంది.
వనపర్తి/కొత్తకోట, ఫిబ్రవరి 16: కొత్తకోట మున్సిపాలిటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇవాళ సోమవారం జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో 9వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అరుణ శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం నేడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రమాణ స్వీకారాలు, పరోక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నియామకం జరిగింది.