Share News

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదు

ABN , Publish Date - Sep 17 , 2026 | 04:38 AM

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండబోదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24ు ప్రాతినిధ్యం ఉందని, మొత్తం లోక్‌సభ స్థానాలను దామాషా ప్రకారం పెంచితే.. డీలిమిటేషన్‌ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదు
Ktr

  • దామాషా ప్రకారం పెంచితే

  • డీలిమిటేషన్‌కు మద్దతు: కేటీఆర్‌

  • హరియాణాలోని జిందాల్‌

  • గ్లోబల్‌ వర్సిటీలో ప్రసంగం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు16 (ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండబోదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24ు ప్రాతినిధ్యం ఉందని, మొత్తం లోక్‌సభ స్థానాలను దామాషా ప్రకారం పెంచితే.. డీలిమిటేషన్‌ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని పేర్కొన్నారు. హరియాణాలోని సోనిపట్‌లో ఉన్న జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీలో బుధవారం ‘‘ఇన్నోవేషన్‌ ఇన్‌ గవర్నెన్స్‌: ది స్టోరీ ఆఫ్‌ ఏ స్టార్టప్‌ స్టేట్‌’’ అనే అంశంపై కేటీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రతీ పెద్ద సాంకేతిక పరివర్తన సమయంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయన్నారు. ప్రస్తుతం ఏఐ విషయంలోనూ అదే జరుగుతోందని, దాన్ని స్వీకరించి ముందుకు సాగాల్సిందేనని అభిప్రాయపడ్డారు. మౌలిక వసతులు కల్పించడం, విశ్వసనీయమైన సేవలందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ.. తెలంగాణలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు గోదావరి జలాలను ఎలా తరలించాలనే సవాల్‌కు ఇంజనీరింగ్‌ పరిష్కారమే ఈ ప్రాజెక్టు అని అభివర్ణించారు.

Updated Date - Sep 17 , 2026 | 04:38 AM