జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ టాప్
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:53 AM
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో మన రాష్ట్రం మరోసారి రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక జీఎస్టీ వసూళ్లు జరిగిన రాష్ట్రంగా నిలిచింది
జీఎస్టీ వసూళ్లలో
తెలంగాణ టాప్
సెప్టెంబరులో ఏకంగా 18 శాతం వృద్ధి నమోదు
ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లోనూ అంతే శాతం వృద్ధి
గుజరాత్ 17ు, కర్ణాటక 16ు, మహారాష్ట్ర 15ు
అన్ని రకాల రాష్ట్ర పన్నుల రాబడిలో 15ు వృద్ధి
ఈ 6 నెలల్లో పన్నుల రాబడి రూ.44,372 కోట్లు
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో మన రాష్ట్రం మరోసారి రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక జీఎస్టీ వసూళ్లు జరిగిన రాష్ట్రంగా నిలిచింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ కూడా తెలంగాణతో సరిసమానంగా వృద్ధిని నమోదు చేశాయి. ఈ మూడు రాష్ట్రాలు సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లలో ఏకంగా 18 శాతం వృద్ధిని సాధించాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఇదే అత్యధిక వృద్ధి శాతం కావడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబరు నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను గురువారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2025 సెప్టెంబరులో రాష్ట్రం నుంచి రూ.4,512 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఈ సెప్టెంబరులో రూ.5,327 కోట్లు వసూలయ్యాయి. అంటే వృద్ధిరేటు 18శాతం! ఇది జాతీయ సగటు వృద్ధి అయిన 10 శాతం కంటే చాలా ఎక్కువ.
పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌మాత్రమే అత్యధికంగా ఈ 18 శాతం వృద్ధిని సాధించాయి. గుజరాత్ 17 శాతం, కర్ణాటక 16 శాతం, మహారాష్ట్ర 15 శాతం మేర వృద్ధిని నమోదు చేశాయి. కాగా పలు రకాల రాష్ట్ర పన్నుల ద్వారా సెప్టెంబరు నెలలో ఖజానాకు గణనీయంగా ఆదాయం సమకూరింది. నిరుడు సెప్టెంబరు వసూళ్ల కంటే.. ఈసారి సెప్టెంబరులో 15 శాతం వృద్ధి నమోదైంది. జీఎస్టీ విలువ ఆధారిత పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ (పీటీ) కలిపి నిరుడు సెప్టెంబరు నెలలో 6,368 కోట్ల పన్ను రాబడి సమకూరింది. ఈ సెప్టెంబరులో రాష్ట్ర పన్ను రాబడి కింద రూ.7,303 కోట్లు వచ్చాయి. అంటే... రూ.935 కోట్ల అధికంగా సమకూరాయి. ఇది 15 శాతం వృద్ధిగా నమోదైందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు వివరించాయి. జీఎస్టీ కింద రూ.4,184 కోట్లు, వ్యాట్ కింద రూ.3,045 కోట్లు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద రూ.74 కోట్లు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఆరు నెలల కాలంలో అన్ని రకాల పన్నుల ద్వారా రూ.44,372 కోట్లు సమకూరాయి. ఇది నిరుడు ఆరు నెలల కాలంలో సమకూరిన రూ.38,269 కోట్ల కంటే 16 శాతం అధికం. అంటే... రూ.6,103 కోట్లు ఎక్కువగా వచ్చాయి.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళపై సామూహిక అత్యాచారం.. ప్రియుడి భార్య సూచనలతోనే.
lప్రయాణికులను కాపాడేది వాళ్లే.. ఎమర్జెన్సీలో జరిగేదేంటో ముందే చెప్పిన హీరో పైలట్