రికార్డు స్థాయిలో థర్మల్ విద్యుదుత్పత్తి
ABN , Publish Date - Nov 13 , 2026 | 06:03 AM
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గురువారం రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి జరిగింది
ఒక్క రోజే 6,088 మెగావాట్ల థర్మల్ విద్యుత్
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గురువారం రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి జరిగింది. రాష్ట్రంలో 6 చోట్ల ప్లాంట్లు ఉండగా... వాటిలో గురువారం ఒక్క రోజే 6,088మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. యాదాద్రి(దామరచర్ల)లో 3200 మెగావాట్లకు 2,705, భద్రాద్రి(మణుగూరు)లో 1080 మెగావాట్లకు 767, కేటీపీపీ(భూపాలపల్లి)లో, కేటీపీఎ్‌స(పాల్వంచ) ఏడో దశలో 800 మెగావాట్లకు 801, కేటీపీఎస్ ఆరో దశలో 500 మెగావాట్లకు 509, కేటీపీఎస్ ఐదో దశలో 500 మెగావాట్లకు 230 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి జరిగింది. కాగా, రాష్ట్రంలో గురువారం ఉదయం 7:27 గంటల సమయంలో విద్యుత్ డిమాండ్ 12,984 మెగావాట్లుగా నమోదైంది.