Share News

అంగన్వాడీల్లోనూ ఒంటిపూట బడులు.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..

ABN , Publish Date - Mar 15 , 2026 | 09:10 PM

సాధారణ పాఠశాలల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఒంటిపూట బడి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాల సమయాలను కూడా మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అంగన్వాడీల్లోనూ ఒంటిపూట బడులు.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..
Anganwadi centres half day school

సాధారణ పాఠశాలల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఒంటిపూట బడి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాల సమయాలను కూడా మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో వేలాది మంది చిన్నారులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించనుంది. చిన్నారుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది (Anganwadi centres half day school).


అంగ‌న్వాడీల‌కు ఒంటిపూట బడులను ఏప్రిల్ 23వ తేదీ వరకు నిర్వహిస్తారు (Anganwadi education policy). ఆ తర్వాత నెల రోజుల పాటు వేసవి సెలవులపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. అంగ‌న్వాడీ చ‌రిత్ర‌లోనే గ‌త ఏడాది నుంచి ఒంటిపూట బ‌డులు, వేసవి సెల‌వులు ఇస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సమయాలు మారినప్పటికీ, లబ్ధిదారులకు అందాల్సిన పోషకాహారం విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఏర్పాట్లు చేసింది. టేక్ హోం రేషన్ ద్వారా లబ్ధిదారులకు పౌష్టికాహార పంపిణీ కొనసాగనుంది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ అణు కేంద్ర నగరంపై దాడులు.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ విమానాలు..


మీది డేగ చూపు అయితే.. ఇసుకలో దాక్కున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Mar 15 , 2026 | 09:39 PM