Share News

తలసరి ఆదాయంలో తెలంగాణ దూకుడు..

ABN , Publish Date - Aug 01 , 2026 | 09:13 AM

తలసరి ఆదాయంలో రాష్ట్రం దూసుకెళుతోంది. 2025-26లో రూ.4,18,931 తలసరి ఆదాయంతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. అంతకుముందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10.23 శాతం వృద్ధి నమోదు చేసింది. శుక్రవారం యూపీ, పంజాబ్‌, కేరళ మినహా మిగతా రాష్ట్రాల జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం వివరాలతో..

తలసరి ఆదాయంలో తెలంగాణ దూకుడు..

  • 2025-26లో రూ.4,18,931

  • దేశంలోనే రెండో స్థానంలో రాష్ట్రం

  • 2024-25తో పోల్చితే 10.23శాతం వృద్ధి

  • జీఎస్‌డీపీలో ఏడో స్థానంలో తెలంగాణ

  • ఆర్‌బీఐ నివేదికలో వెల్లడి

  • యూపీ, పంజాబ్‌, కేరళ మినహా రాష్ట్రాల గణాంకాలు విడుదల

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): తలసరి ఆదాయంలో రాష్ట్రం దూసుకెళుతోంది. 2025-26లో రూ.4,18,931 తలసరి ఆదాయంతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. అంతకుముందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10.23 శాతం వృద్ధి నమోదు చేసింది. శుక్రవారం యూపీ, పంజాబ్‌, కేరళ మినహా మిగతా రాష్ట్రాల జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం వివరాలతో రిజర్వు బ్యాంకు నివేదిక విడుదల చేసింది. తెలంగాణ జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలో వేగంగా పెరుగుదల ఉందని తెలిపింది. 2024-25లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,80,031కాగా, 2025-26లో మరో రూ.38,900 పెరిగింది. 10.23 శాతం వృద్ధిని నమోదు చేసింది 2025-26లో తెలంగాణ జీఎ్‌సడీపీ రూ.16,14,771 కోట్లుగా ఉందని, దేశంలో ఏడో స్థానంలో నిలిచిందని ఆర్‌బీఐ వెల్లడించింది. ముందటి ఆర్థిక సంవత్సరం (2024-25) నాటి జీఎ్‌సడీపీ రూ.14,67,913 కోట్లతో పోలిస్తే.. ఇది 1,56,858 కోట్లు (10.75శాతం) ఎక్కువని తెలిపింది.


2025-26లో.. (రూ.లలో)

రాష్ట్రం - తలసరి ఆదాయం

  • కర్ణాటక - 4,33,326

  • తెలంగాణ - 4,18,931

  • తమిళనాడు - 4,08,027

  • గుజరాత్‌ - 3,57,531

  • మహారాష్ట్ర - 3,47,903

  • ఆంధ్రప్రదేశ్‌ - 2,94,507


2025-26లో పెద్ద రాష్ట్రాల జీఎస్‌డీపీ (రూ.కోట్లలో)

రాష్ట్రం - జీఎస్‌డీపీ

  • మహారాష్ట్ర - 44,84,537

  • తమిళనాడు - 31,60,206

  • కర్ణాటక - 29,80,634

  • గుజరాత్‌ - 26,36,003

  • పశ్చిమబెంగాల్‌ - 17,99,664

  • రాజస్థాన్‌ - 16,85,118

  • తెలంగాణ - 16,14,771

  • ఆంధ్రప్రదేశ్‌ - 15,79,501

  • మధ్యప్రదేశ్‌ - 15,08,655

  • బీహార్‌ - 10,03,951

Updated Date - Aug 01 , 2026 | 09:13 AM