రూ.2,500 కోట్ల అప్పు తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
ABN , Publish Date - Oct 03 , 2026 | 06:33 AM
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకోనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈనెల 6న నిర్వహించే ఈ-వేలం ద్వారా ఆ రుణాన్ని సేకరించనుంది
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకోనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈనెల 6న నిర్వహించే ఈ-వేలం ద్వారా ఆ రుణాన్ని సేకరించనుంది. 20 ఏళ్ల కాల పరిమితితో రూ.1000 కోట్లు, 26 ఏళ్ల కాల పరిమితితో రూ.1,500 కోట్లు తీసుకోనుంది. తెలంగాణ సహా దేశంలోని 13 రాష్ట్రాలు రూ.25,100 కోట్ల అప్పుల కోసం ఆర్‌బీఐకి ఇండెంట్లు పెట్టాయి.