Share News

మీ-సేవలో పహాణి’ పునరుద్ధరణ

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:49 AM

మీ-సేవ కేంద్రాల నుంచి భూమి పహాణి పత్రాల ముద్రణను రెండు రోజుల క్రితం.. ఈ నెల ఏడో తేదీన రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. రైతుల దరఖాస్తును తహసీల్దార్‌ అనుమతినిస్తే మీ-సేవ కేంద్రం నుంచి ప్రభుత్వ అధికారిక పత్రంపై ‘పహాణి’ని పొందొచ్చు.

మీ-సేవలో పహాణి’ పునరుద్ధరణ
pahani

  • దరఖాస్తును తహసీల్దార్‌ అనుమతించగానే ముద్రణ

  • దరఖాస్తుదారు ఆధార్‌, బయోమెట్రిక్‌ నమోదు తప్పనిసరి

హైదరాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మీ-సేవ కేంద్రాల నుంచి భూమి పహాణి పత్రాల ముద్రణను రెండు రోజుల క్రితం.. ఈ నెల ఏడో తేదీన రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. రైతుల దరఖాస్తును తహసీల్దార్‌ అనుమతినిస్తే మీ-సేవ కేంద్రం నుంచి ప్రభుత్వ అధికారిక పత్రంపై ‘పహాణి’ని పొందొచ్చు. గత ప్రభుత్వం ‘ధరణి’ని అమలులోకి తెచ్చాక మీ-సేవ నుంచి ‘పహాణి’ పత్రాల ముద్రణను తొలగించి వేసింది. అయితే, ఆన్‌లైన్‌లో తెల్ల కాగితంపై ప్రింట్‌ తీసుకునే అవకాశం ఉన్నా.. సంబంధిత రెవెన్యూ అధికారి సంతకం లేక పోవడంతో దాన్ని అధికారిక పత్రంగా ఎక్కడా ఉపయోగించే వీలు ఉండేది కాదు. భూవివాదాల కేసుల్లోనూ కోర్టులు దీన్ని తిరస్కరించేవి. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ధరణి స్థానే భూభారతిని అమలులోకి తెచ్చింది. పహాణి పత్రాలను ఆన్‌లైన్‌లో పొందేందుకు అవకాశం కలిగించాలని రైతుల నుంచి పెరిగిన విజ్ఞప్తులపై దృష్టి సారించిన సర్కారు.. సానుకూల నిర్ణయం తీసుకున్నది. పహాణి పత్రాల ముద్రణ కోసం దరఖాస్తు చేసుకునే రైతు.. సర్వే నంబరు, ఇతర వివరాలు నమోదు చేసి, రూ.90 చెల్లించాలి. ఆ దరఖాస్తును సంబంధిత తహసీల్దార్‌ ఆమోదించాక.. ‘మీ-సేవ’ కేంద్రాల నుంచి ప్రింట్‌ తీసుకోవచ్చు. గతంతో పోలిస్తే.. పహాణి పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి తన పేరుతోపాటు ఆధార్‌ సంఖ్య, బయో మెట్రిక్‌ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.

Updated Date - Nov 10 , 2026 | 06:24 AM