రాష్ట్రంలో జనగణనకు ముహూర్తం ఖరారు
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:43 AM
: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన (సెన్సెస్-2027) ప్రక్రియను తెలంగాణలో చేపట్టేందుకు ముహూర్తం ఖరారయింది.
జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు...
జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ గణనకు అవకాశం
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన (సెన్సెస్-2027) ప్రక్రియను తెలంగాణలో చేపట్టేందుకు ముహూర్తం ఖరారయింది. జనగణన రెండో దశ ప్రక్రియలో భాగంగా 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలను సేకరించాలని, ఈ ప్రక్రియకు ముందు జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీఓఎంఎస్ 155ను జారీచేశారు. జనగణన ప్రక్రియలో స్వీయ గణన, ఇంటింటి సర్వే, రివిజనల్ రౌండ్ అనే మూడుదశలు ఉంటాయి. మొదటి దశలో జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు తమ కుటుంబానికి సంబంధించిన వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోదశలో జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఇంటింటికివెళ్లి కుటుంబాలవారీగా జనాభా వివరాలను ేసకరిస్తారు. మూడో దశ రివిజనల్ రౌండ్లో మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేకంగా పున:పరిశీలన జరుగుతుంది.