ఉదయం 11.40... సభలో 26 మంది
ABN , Publish Date - Sep 11 , 2026 | 06:09 AM
అసెంబ్లీ సమావేశాలంటే సభ్యులంతా సభలో ఉండాలి. ఇది రూల్ పొజిషన్ కూడా. కానీ, గురువారం రోజు సభకు హాజరైన ఎమ్మెల్యేలందరూ బయటకు వెళ్లడం, రావడంతోనే సరిపోయింది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే.. అంటే 11.40 గంటలకు సభలో 26 మంది సభ్యులు ఉండగా.. వారిలో మంత్రులు ముగ్గురు ఉన్నారు.
మధ్యాహ్నం 2.30గంటలకు 16 మందే
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ సమావేశాలంటే సభ్యులంతా సభలో ఉండాలి. ఇది రూల్ పొజిషన్ కూడా. కానీ, గురువారం రోజు సభకు హాజరైన ఎమ్మెల్యేలందరూ బయటకు వెళ్లడం, రావడంతోనే సరిపోయింది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే.. అంటే 11.40 గంటలకు సభలో 26 మంది సభ్యులు ఉండగా.. వారిలో మంత్రులు ముగ్గురు ఉన్నారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటలకు 16 మందే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సభలోని సీట్లన్నీ చాలావరకు ఖాళీగానే దర్శనమిచ్చాయి. మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి, సభలోకి అడుగుపెట్టిన సభ్యులు కూడా పూర్తిస్థాయిలో సభలో ఉండడంలేదు. అంశాలపైనా కూడా పెద్దగా మాట్లాడడంలేదు. ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.
సభకు హాజరు కాని కొండా సురేఖ
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఎమ్మెల్యే కొండా సురేఖ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. సభ ప్రారంభమైన రోజు నుంచి గురువారం వరకు ఒక్క సెషన్‌కు కూడా ఆమె రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.