దానంపై అనర్హతవేటు సబబే
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:53 AM
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పదునును పునరుద్ఘాటిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం సమర్థించింది.

పార్టీ ఫిరాయింపుల అంశంలో కఠినంగా వ్యవహరిస్తాం
అలాంటివారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేం: సుప్రీం
బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. పార్టీ నన్ను సస్పెండ్ చేయలేదు
ఒక వ్యక్తి తన తప్పు తెలుసుకుని తిరిగొస్తే మన్నించవచ్చని
రాజ్యాంగం చెబుతోంది.. దానం తరఫున రోహత్గీ వాదన
దానం నాగేందర్‌కు ఎమ్మెల్యే అనే ‘ఎఫ్‌డీ’ ఉండేది
ఎంపీగా పోటీచేసి ‘షేర్ మార్కెట్’లో అది పోగొట్టుకున్నారు
‘ఘర్ వాపసీ’తో అనర్హత ముద్ర చెరిగిపోదు: ధర్మాసనం
హైకోర్టు తీర్పుకు సమర్థన.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పదునును పునరుద్ఘాటిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం సమర్థించింది. ఒకసారి పార్టీ మారి అనర్హత ముద్ర పడిన తర్వాత, తిరిగి పాత పార్టీలోకి (ఘర్ వాపసీ) వచ్చినా ఆ అనర్హత చెరిగిపోదని స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ వాటిని కొట్టివేశారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా.. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పేరా 2(1)(ఎ) రెడ్ విత్ 191(2) ప్రకారం దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది. దానం నాగేందర్ 19న సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దానిపై గురువారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
ఎమ్మెల్యే వదులుకుంటేనే
అనర్హత వేటు: ముకుల్ రోహత్గీ
తొలుత దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ చాలా కీలకమైనదని.. అందులోని మొదటి భాగం ప్రకారం ఎమ్మెల్యే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటేనే అనర్హత వేటు పడుతుందని పేర్కొన్నారు. అంతేకాదు 10వ షెడ్యూల్‌లో ‘క్షమించే/మన్నించే’ (కాండోనేషన్) నిబంధన లేదా ‘ఘర్ వాపసీ’ (స్వగృహానికి తిరిగొచ్చేయడం) సదుపాయం ఉందని... తమ కేసు సరిగ్గా ఈ ‘ఘర్ వాపసీ’ పరిధిలోకి వస్తుందని ధర్మాసనానికి నివేదించారు. దానం నాగేందర్ ఇప్పటికీ బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నారని, పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యారని.. బీఆర్‌ఎస్ సైతం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వివరించారు. ఘర్‌వాపసీ ద్వారా తిరిగొచ్చినప్పుడు పార్టీ అంగీకరిస్తే.. పార్టీ మారిన మరక పోతుందని, రాజ్యాంగం కూడా తప్పు తెలుసుకుని తిరిగొచ్చిన వ్యక్తిని క్షమించడానికి అవకాశం కల్పిస్తోందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ కూడా దానం నాగేందర్ తమ పార్టీలోనే ఉన్నారని చెబుతున్నారని.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 39 ఎమ్మెల్యేలు (దానంతో కలుపుకుని) తమ పార్టీకి ఉన్నారని ప్రకటించారని వివరించారు.
అనర్హత వేటు పడితే..
మళ్లీ వెళ్లి పోటీ చేయవచ్చు: ధర్మాసనం
ముకుల్ రోహత్గీ వాదనలపై ధర్మాసనం ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలు తరచూ పార్టీలు మారడం ‘షేర్ మార్కెట్ పెట్టుబడి’ లేదా ‘లక్కీడిప్ బంపర్ డ్రా’లా ఉందని పేర్కొంది. న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనా పటిమను మెచ్చుకుంటూనే.. ఘర్ వాపసీ పరిధిపై స్పష్టత ఇచ్చింది. ఒక ఎమ్మెల్యే స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకున్న తర్వాత పార్టీ క్షమించి తిరిగి చేర్చుకున్నప్పటికీ.. అది ఆ వ్యక్తికి పార్టీ సభ్యత్వాన్ని మాత్రమే ఇస్తుందని, చట్టసభ (అసెంబ్లీ) సభ్యత్వాన్ని పునరుద్ధరించదని, అనర్హత నుంచి కాపాడదని తేల్చి చెప్పింది.
10 వ షెడ్యూల్‌లోని మన్నింపు (కాండోనేషన్) నిబంధన కేవలం క్లాజ్ (బీ)లోని విప్ ఉల్లంఘనకు మాత్రమే వర్తిస్తుందని.. దాన్ని క్లాజ్ (ఏ)కి విస్తరించలేమని పేర్కొంది. పార్టీ మీపై దయ చూపవచ్చుగానీ, స్పీకర్ దయ చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. పార్టీలు మారేవారి విషయంలో 10వ షెడ్యూల్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని.. అలాంటి వారికి అనుకూలంగా వ్యాఖ్యానించలేమని స్పష్టం చేసింది. చివరగా ఈ అంశంపై సరదాగా స్పందిస్తూ.. ‘‘అనర్హత వేటు పడితే మళ్లీ వెళ్లి పోటీ చేయవచ్చు, లేదా మీరు బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారు కాబట్టి.. మీ పార్టీ మిమ్మల్ని రాజ్యసభకు పంపవచ్చు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఏమైనా జరగవచ్చు’’ అని పేర్కొందిఅనుకూలంగా వ్యాఖ్యానించలేమని స్పష్టం చేసింది. చివరగా ఈ అంశంపై సరదాగా స్పందిస్తూ.. ‘‘అనర్హత వేటు పడితే మళ్లీ వెళ్లి పోటీ చేయవచ్చు, లేదా మీరు బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారు కాబట్టి.. మీ పార్టీ మిమ్మల్ని రాజ్యసభకు పంపవచ్చు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఏమైనా జరగవచ్చు’’ అని పేర్కొంది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. దానం నాగేందర్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది. 2024 ఏప్రిల్ 23 నుంచే దానం నాగేందర్‌పై అనర్హత వేటు అమల్లోకి వస్తుందని, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు తీర్పులో పేర్కొన్న నేపథ్యంలో.. ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక ఖాయమైంది
సుప్రీంకోర్టు
గడువు నిర్దేశించడంతోనే..
బీఆర్‌ఎస్ కారు గుర్తుపై గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారంటూ దానం నాగేందర్‌తోపాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్లలో పేర్కొంది. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన అప్పటి చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం.. నాలుగు వారాల్లో తేల్చాలని, లేదంటే కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. పార్టీ మారేవారి విషయంలో 10వ షెడ్యూల్ నిబంధనలను ఈ క్రమంలో స్పీకర్ విచారణ జరిపి దానం సహా మిగతా వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు
వర్తిస్తుందని.. దాన్ని క్లాజ్ (ఏ)కి విస్తరించలేమని పేర్కొంది. పార్టీ మీపై దయ చూపవచ్చుగానీ, స్పీకర్ దయ చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.
ఫిక్స్‌డ్ డిపాజిట్’
పోగొట్టుకున్నారు!
విచారణ ప్రారంభం కాగానే దానం నాగేందర్ పరిస్థితిని ఉద్దేశించి జస్టిస్ బాగ్చి సరదా వ్యాఖ్యలు చేశారు. ‘మీకు ఎమ్మెల్యేగా ఒక ‘ఫిక్సిడ్ డిపాజిట్’ ఉండేది. ఎంపీగా పోటీచేసి ‘షేర్ మార్కెట్’లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూశారు. చివరికి ఉన్న ఆ ‘ఫిక్సిడ్ డిపాజిట్’ను కూడా పోగొట్టుకున్నారు’ అని పేర్కొన్నారు. ఇక మరో సందర్భంలో ‘మీ కేస్ చూస్తుంటే ఆయా రామ్, గయా రామ్, ఫిర్ ఆయా రామ్ (వచ్చారు, పోయారు, మళ్లీ వచ్చారు) లాగా ఉందే?’’ అని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి