Share News

రేపు హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం

ABN , Publish Date - Oct 22 , 2026 | 06:13 AM

ఈనెల 23న హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది.

రేపు హైదరాబాద్‌లో   దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం
tgpolice

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఈనెల 23న హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఐదు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దక్షిణాది రాష్ట్రాల పోలీసులు ఎదుర్కొంటున్న మత్తుమందుల రవాణా, సైబర్‌ నేరాలు, మ్యూల్‌ ఖాతాలు, వ్యవస్ధీకృత నేరాలు, అంతరాష్ట్ర పోలీసుల సమన్వయం, నిఘా సమాచార మార్పిడి, శాంతి భద్రతలు, అంతర్గత భద్రతకు ఎదురవుతున్న సవాళ్లపై చర్చించనున్నారు.

Updated Date - Oct 22 , 2026 | 06:16 AM