Share News

నేడు హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సు

ABN , Publish Date - Sep 18 , 2026 | 06:00 AM

దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ, అనుబంధ రంగాల సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లో జరగనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

నేడు హైదరాబాద్‌లో   దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సు
TummalaNageshwarrao

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ, అనుబంధ రంగాల సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లో జరగనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సదస్సులో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తోపాటు దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ప్రసంగించనున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తారు.

Updated Date - Sep 18 , 2026 | 06:00 AM