Share News

సీఎం రేవంత్‌కు ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డు

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:11 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-బెస్ట్‌ పబ్లిక్‌ సర్వెంట్‌-2026’ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఉత్తమ ప్రజాసేవకుడిగా గుర్తిం చి కేరళంకు చెందిన దిగ్గజ కాంగ్రెస్‌ నేత, దివంగత ఆర్యదాన్‌ ముహ్మద్‌ స్మారకార్ధం ఆర్యదాన్‌ ముహమ్మద్‌ ఫౌండేషన్‌ ఈ పురస్కారాన్ని అందజేస్తోంది.

సీఎం రేవంత్‌కు  ఆర్యదాన్‌   ముహమ్మద్‌ అవార్డు
RevanthReddy

  • ఉత్తమ ప్రజాసేవకుడిగా ఎంపిక

  • నేడు కేరళంలో ప్రదానం

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-బెస్ట్‌ పబ్లిక్‌ సర్వెంట్‌-2026’ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఉత్తమ ప్రజాసేవకుడిగా గుర్తిం చి కేరళంకు చెందిన దిగ్గజ కాంగ్రెస్‌ నేత, దివంగత ఆర్యదాన్‌ ముహ్మద్‌ స్మారకార్ధం ఆర్యదాన్‌ ముహమ్మద్‌ ఫౌండేషన్‌ ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. ముహమ్మద్‌ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని కేరళంలోని నిలంబూర్‌లో శుక్రవారం అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రేవంత్‌రెడ్డి కేరళం వెళ్లారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో పురస్కారం కింద రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్‌ పాల్గొనున్నారు. తెలంగాణలో రైతులు, వెనుబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి సీఎం రేవంత్‌ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టిగల నాయకత్వానికిగానూఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఫౌండేషన్‌ వర్కింగ్‌ ఛైర్మన్‌, నిలంబూర్‌ ఎమ్మెల్యే ఆర్యదాన్‌ షౌకత్‌ తెలిపారు. కాగా, దివంగత ఆర్యదాన్‌ ముహమ్మద్‌ కేరళం కాంగ్రె్‌సలో సీనియర్‌ నాయకుడు. 8సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతోపాటునాలుగు సార్లు మంత్రిగా సేవలు అందించారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎల్‌నినోపై ‘ఉపాధి’ అస్త్రం

ఊపందుకున్న ఉపాధి పనులు

Updated Date - Sep 25 , 2026 | 05:26 AM