Share News

5 వరకు రేషన్‌ బియ్యం పంపిణీ

ABN , Publish Date - Sep 02 , 2026 | 06:46 AM

పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పంపిణీ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించింది

5 వరకు రేషన్‌ బియ్యం పంపిణీ

గడువు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పంపిణీ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించింది. ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు గత జూలైలో ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి ప్రారంభించి 31తో సరఫరా ప్రక్రియను ముగిస్తామని ముందే చెప్పినా.. రోజు దుకాణాల వద్ద రద్దీతోపాటు రాఖీ పండుగకు చాలామంది సొంతూర్లకు వెళ్లడంతో తీసుకోలేకపోయారు. ఈ తరుణంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సన్నబియ్యం చేరాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరికొన్ని రోజులపాటు పంపిణీ గడువును పొడిగించింది. 5వతేదీ సాయంత్రం వరకు సరఫరా ఉంటుందని, లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Sep 02 , 2026 | 06:51 AM