ఖమ్మంలో అరుదైన టైటా గుడ్లగూబ ప్రత్యక్షం
ABN , Publish Date - Aug 31 , 2026 | 05:24 AM
ఖమ్మం జిల్లాలో అరుదైన ‘టైటా’ జాతికి చెందిన గుడ్లగూబ ప్రత్యక్షమైంది.
వైరా, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లాలో అరుదైన ‘టైటా’ జాతికి చెందిన గుడ్లగూబ ప్రత్యక్షమైంది. ఆదివారం వైరా మునిసిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామానికి చెందిన ప్రవీణ్ ఇంటి పరిసరాల్లో ఒక గుడ్లగూబ రెక్కకు గాయమై, ఎటూ కదల్లేని పరిస్థితుల్లో కనిపించింది. ఇది అరుదైన టైటా జాతికి చెందినదిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ వింత పక్షిని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.