Share News

పరుగుల చీతా.. ప్రవళిక

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:17 AM

పట్టుదల ముందు పేదరికం ఓడిపోయింది. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సహంతో ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన బాలిక అథ్లెటిక్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటనుంది.

పరుగుల చీతా.. ప్రవళిక

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో 35 పతకాలు

భారత 1600 మీటర్ల రిలే జట్టుకు ఎంపిక

అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం

పట్టుదల ముందు పేదరికం ఓడిపోయింది. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సహంతో ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన బాలిక అథ్లెటిక్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటనుంది. భారత త్రివర్ణ పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాలనే తన చిరకా స్వప్నం సాకారం చేసుకోనుంది.

(ఆంధ్రజ్యోతి, డిండి)

నల్లగొండ జిల్లా డిండి మండలకేంద్రానికి చెందిన నారిమళ్ల రాంబాబు విజయ దంపతులకు కుమార్తె, కుమారుడు. కుమార్తె నారిమళ్ల ప్రవళిక 4వ తరగతి వరకు డిండి గ్రామంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పూర్తి చేసింది. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రవేశపరీక్ష రాసి డిండి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో చేరింది. ఇక్కడే ఆమె క్రీడాస్ఫూర్తికి బీజంపడింది. తండ్రి కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి విజయ కుమార్తె విజయాల కోసం అండగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందులు, పేదరికం అడ్డొచ్చినా తన కూతురు కలలను నిజం చేయాలని ఆ దంపతులు సంకల్పించారు. గురుకుల పాఠశాలలో ఓ రోజు తోటి పిల్లలతో కలిసి పరిగెడుతూ ముందు వరుసలో ఉన్న ప్రవళిక ప్రతిభను గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు.

గురుకుల అకాడమీలో ప్రవేశం

గురుకుల పాఠశాలలో 2019లో ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్‌ అకాడమీలో ప్రవళిక ప్రవేశం పొందింది. అథ్లెటిక్‌ కోచ్‌ పసుపుల పరశురాం శిక్షణలో క్రీడా నైపుణ్యాన్ని మరింత పదును పెట్టింది. ప్రతిరోజూ 4నుంచి 6 గంటలపాటు కఠోరా సాధన చేసేది. షాండ్‌(ఇసుక)లో పరుగెత్తడం, హిల్‌క్లైమింగ్‌ వంటి కఠినమైన ఈవెంట్స్‌ను అవలీలగా పూర్తి చేసేది. గంటల తరబడి ఏకాగ్రతతో శ్రమిస్తూ ప్రతిభను మెరుగుపరుచుకునేది.

మలుపు తిప్పిన రాంచీ పోటీలు

2026 మే 20 నుంచి 25వరకు జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీలో జరిగిన 29వ జాతీయ సీనియర్‌ ఫెడరేషన్‌ కప్‌లో 400 మీటర్ల పరుగు పందెం లో ప్రతిభ కనబర్చి భారత 1600 మీటర్ల రిలే జట్టుకు ఎంపికైంది. జూలై 9 నుంచి 12వరకు చైనా దేశంలోని ఆర్‌డో్‌సలో జరిగే అంతర్జాతీయ రిలే పోటీల్లో అండర్‌-23 విభాగంలో భారతదేశం తరుఫున ప్రాతినిధ్యం వహి ంచే అవకాశం తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రవళిక మాత్రమే దక్కింది. 2028లో జరుగనున్న ఒలంపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించాలనే లక్ష్యంతో కఠోర సాధన చేస్తున్నానని ప్రవళిక పేర్కొంది. ఈ ప్రయత్నంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతున్నా పతకంపైనే దృష్టి సారించానని పేర్కొంది.

సాధించిన పతకాలు

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్రవళిక 35 పతకాలు సాధించింది. అందులో 23 స్వర్ణ పతకాలు, ఏడు రజత పతకాలు ఉన్నాయి. 26సార్లు జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. ఫ 2022 సెప్టెంబరు 9 నుంచి 11 వరకు గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన 33వ సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షి్‌ప మిక్స్‌డ్‌ విభాగంలో కాంస్య పతకం

2023 అక్టోబరు 15 నుంచి 17వరకు హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగిన 34వ సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షి్‌ప 1600మీటర్ల రిలేలో మరో కాంస్య పతకం సాధించింది. అదే సంవత్సరం నవంబరు 7నుంచి 10వరకు తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన 38వ జాతీయ జూనియ ర్‌ అథ్లెటిక్స్‌ చాంఫియన్‌షి్‌ఫలో 1600 మీటర్ల రిలేలో కాంస్య పతకం సాధించింది.

కష్టపడే క్రీడాకారిణి ప్రవళిక

అథ్లెటిక్స్‌ క్రీడాకారిణి ప్రవళిక కష్టపడేతత్వం ఉంది. పతకం లక్ష్యంతో సాధన చేస్తుంది. ఆటలలోనే కాదు చదువులో కూడ తక్కువేమికాదని ఈ విద్యాసంవత్సరం జరిగిన పీఈసెట్‌ ప్రవేశపరీక్షలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించింది. ప్రస్తుతం డిగ్రీ బీజెడ్‌సీలో పైనల్‌ ఇయర్‌ ప్రవళిక చదువుతోంది.

శిరీష, ప్రిన్సిపాల్‌

సింథటిక్‌ సర్ఫేస్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలి

అథ్లెటిక్స్‌లో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సింథటిక్‌ సర్ఫేస్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలి. అకాడమిలోని క్రీడాకారులకు ఇస్తున్న ఆహారం కంటే స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం అందించాలి. 2028లో జరిగే ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే లక్ష్యంతో ప్రవళికకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.

పరశురాం, కోచ్‌

Updated Date - Jul 02 , 2026 | 12:17 AM