‘పెద్ది’ టికెట్ ధరల పెంపునకు అనుమతి
ABN , Publish Date - Jun 03 , 2026 | 06:13 AM
తెలంగాణలో రాంచరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రాంచరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విజ్ఞప్తిని పరిశీలించిన హోం శాంఖ మెమో జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు ఈ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. జూన్ 3న రాత్రి 8 గంటలకు ‘పెద్ది’ స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చింది. ఈ స్పెషల్ షోకు టికెట్ ధర రూ.600కు (జీఎస్టీతో కలిపి) పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే సినిమా విడుదల తేదీ నుంచి 10 రోజుల పాటు (ఈ నెల 4 నుంచి 13 వరకు) టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతమున్న టికెట్ ధరలపై సింగిల్ స్ర్కీన్‌లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. వీటితో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వీలు కల్పించింది.