నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:32 PM
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి అరెస్టయ్యారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
హైదరాబాద్, జూన్ 23: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈరోజు(మంగళవారం) ఏసీబీ అధికారులు మల్లారెడ్డి నివాసంతో సహా బంధువులు, బినామీలకు చెందిన 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో 4 గృహాలు, కమర్షియల్ భవనం, 8 ఓపెన్ ప్లాట్లు సహా 10.23 ఎకరాల వ్యవసాయ భూమిని అధికారులు గుర్తించారు.
3.31 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయల బ్యాంక్ డిపాజిట్లను ఫ్రీజ్ చేశారు. భార్య, కుటుంబసభ్యుల పేర్లపై ఉన్న మూడు బ్యాంక్ లాకర్లను గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు తేలిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా, మూడు సంవత్సరాల క్రితం ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా మల్లారెడ్డి విధుల్లో చేరారు. ఇటీవల ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయ్యింది. దీంతో ఈరోజు తెల్లవారుజామునే ప్రత్యేక బృందాలు నిజామాబాద్ చేరుకుని.. అక్కడి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి
నటుడి పార్టీ అంటూ విమర్శలు.. తిప్పికొట్టిన సీఎం విజయ్