Share News

పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రానికి 47.3 మార్కులు

ABN , Publish Date - Jul 29 , 2026 | 08:21 AM

దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణంపై నీతి ఆయోగ్‌ తొలిసారిగా రూపొందించిన ‘ ఇన్వె్‌స్టమెంట్‌ ఫ్రెండ్లీనెస్‌ ఇండెక్స్‌’ నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సూచిలో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ 100 మార్కులకు 47.3 స్కోరు సాధించి ‘ఫ్రంట్‌ రన్నర్‌’ విభాగంలో నిలిచింది.

పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రానికి 47.3 మార్కులు

  • పెద్ద రాష్ట్రాల కేటగిరిలో 8వ స్థానం.. ఏపీకి 6వ ర్యాంకు

హైదరాబాద్‌ ( ఆంధ్రజ్యోతి): దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణంపై నీతి ఆయోగ్‌ తొలిసారిగా రూపొందించిన ‘ ఇన్వె్‌స్టమెంట్‌ ఫ్రెండ్లీనెస్‌ ఇండెక్స్‌’ నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సూచిలో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ 100 మార్కులకు 47.3 స్కోరు సాధించి ‘ఫ్రంట్‌ రన్నర్‌’ విభాగంలో నిలిచింది. తద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ 13వ ర్యాంకును, పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 8వ ర్యాంకును కైవసం చేసుకుంది. జూలై 17న విడుదలైన ఈ నివేదికలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిశా అగ్రస్థానాల్లో నిలవగా.. పొరుగు రాష్ట్రమైన ఏపీ 48.7 మార్కులతో 8వ స్థానంలో నిలిచింది. ఇక పెద్ద రాష్ట్రాల కేటగిరీని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 6వ స్థానం, తెలంగాణకు 8వ స్థానం దక్కాయి.

ఇప్పటివరకు రాష్ట్రాల పనితీరును ప్రధానంగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా అంచనా వేసేవారు. అయితే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం మాత్రమే పెట్టుబడులను ఆకర్షించడానికి సరిపోదని భావించిన కేంద్రం.. పెట్టుబడులకు ఉన్న అనుకూలతపై పలు కేటగిరీల్లో పరిశీలన జరిపి ఈ కొత్త ఇండెక్స్‌ను రూపొందించింది. వ్యాపార అనుమతులు, నాణ్యమైన విద్యుత్‌, ఐటీ, ఫార్మా రంగాలు, హైదరాబాద్‌ జీవన ప్రమాణాల పరంగా తెలంగాణ మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ, అగ్ర రాష్ట్రాల సరసన నిలవకపోవడానికి రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యమే ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా పెరుగుతున్న అప్పులు, రెవెన్యూ లోటు, వడ్డీ చెల్లింపుల భారం పెట్టుబడుల స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపాయని తేల్చింది.

Updated Date - Jul 29 , 2026 | 08:21 AM