Share News

జేఎ్‌సజేబీ 3.0లో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:22 AM

వర్షం నీటి సంరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్‌ సంచయ్‌ జనభాగీదారి (జేఎ్‌సజేబీ) 3.0లో ప్రజలంతా భాగస్వాములు కావాలని మునిసిపల్‌ చైర్‌పర్సన తంగేళ్లపల్లి శ్రీవాణి అన్నారు.

జేఎ్‌సజేబీ 3.0లో భాగస్వాములు కావాలి
భువనగిరిలో ప్రతిజ్ఞ చేస్తున్న చైర్‌పర్సన శ్రీవాణి, అధికారులు

మునిసిపల్‌ చైర్‌పర్సన శ్రీవాణి

భువనగిరిటౌన, జూలై 14 (ఆంధ్రజ్యోతి): వర్షం నీటి సంరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్‌ సంచయ్‌ జనభాగీదారి (జేఎ్‌సజేబీ) 3.0లో ప్రజలంతా భాగస్వాములు కావాలని మునిసిపల్‌ చైర్‌పర్సన తంగేళ్లపల్లి శ్రీవాణి అన్నారు. మంగళవారం మునిసిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘సేవ్‌ ద వాటర్‌’ నినాదంతో ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించాలన్నారు. ఇంకుడు గుంతలతో నీటి వృథా తగ్గి భూగర్భజలాల నీటిమట్టం పెరుగుతుందన్నారు. చెరువులు, కుంటలు, అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అనంతరం వర్షపు నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ కె.చంద్రప్రకాశరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మోత్కూరు : రోజు రోజుకు వర్షాభావ పరిస్థితులు నెలకొని భూగర్భ జలాలు తగ్గిపోతున్నందున వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలు పెంచాలని మోత్కూరు మునిసిపల్‌ కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య పిలుపునిచ్చారు. మంగళవారం మో త్కూరు జిల్లా పరిషతఉన్నత పాఠశాలలో ’క్యాచ ద రెయిన’ నినాదంతో ఇంకుడు గుంతల నిర్మాణం ఆవశ్యకత, భూగర్భ జలాల సంరక్షణ, నీటి పునర్వినియోగం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచఎం డి.అరవిందరాయుడు, మునిసిపల్‌ ఇనచార్జి మేనేజర్‌ సాబాజ్‌, టీపీఓ వెంకటేష్‌, శ్రవణ్‌, నిఖిల్‌, కిరణ్‌, రాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 12:22 AM