Share News

వానాకాలానికి మూసీ సాగునీరు అందేనా?

ABN , Publish Date - May 11 , 2026 | 12:12 AM

వానాకాలంలో మూసీ సాగునీటి విడుదలపై రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రతీసారి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అంద డం లేదు. కేవలం ఆరుతడి పంటలకు సాగునీరు అందించాలని మూసీ ప్రాజెక్టును నిర్మించారు.

వానాకాలానికి మూసీ సాగునీరు అందేనా?

ఇప్పటికే రూ.65 కోట్ల ఖర్చుతో ఆధునికీకరణ

ఇంకా నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు

కొనసాగుతున్న మూసీ ఎడమ కాల్వ ఆధునికీకరణ పనులు

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట) : వానాకాలంలో మూసీ సాగునీటి విడుదలపై రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రతీసారి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అంద డం లేదు. కేవలం ఆరుతడి పంటలకు సాగునీరు అందించాలని మూసీ ప్రాజెక్టును నిర్మించారు. అయితే దాదాపు ఆరుతడి పంటల సాగు తగ్గి వరి పంటలవైపే రైతులు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఎక్కువ నీరు రైతులకు అవసరం అవుతుంది. అయితే ప్రతీసారి లాగా ఈసారి కూడా మొండి చేయి చూపుతారా? అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూసీ ప్రాజెక్టు ఆధునికీకరణకు 2019లో అప్పటి ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.65 కోట్లు మంజూరుచేశారు. ఈ రూ.65కోట్లతో మూసీ కాల్వల రివిట్‌మెంట్‌, తూముల రిపేర్లు, కంపచెట్లను తొలగించడం, బ్రిడ్జిల నిర్మాణాలు చేశారు. ఇంకా నిధులు సరిపోవడం లేదని అధికారులు సుమారు రూ.20కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపారు. నిధులు మంజూరైతే పూర్తిస్థాయిలో ఆధునికీకరణ జరిగి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందుతుంది. జూన్‌ నెల నుంచి ఖరీఫ్‌ ప్రారంభమవుతుంది.

ఉమ్మడి జిల్లాలో రెండో ప్రతి ప్రాజెక్ట్‌

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అతి పెద్ద రెండో ప్రాజెక్టుగా పేరొందిన మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 630 అడుగులు దాకా ఉంది. ఎడమ కాల్వ 38 కిలోమీటర్ల పొడవు ఉండగా, మూసీ కుడి కాల్వ 40 కిలోమీటర్ల పొడవు ఉంది. మూసీ ఎడమ కాల్వ కింద సూర్యాపేటరూరల్‌, పెన్‌పహాడ్‌ మండలాల్లోని పలు గ్రామాలు, కుడి కాల్వ కింద నకిరేకల్‌, కేతేపల్లి, వేములపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అం దజేస్తారు. మూసీ ప్రాజెక్టులో నీరు 630 అడుగులు ఉండడంతో పాటు జూన్‌లో ఎగువన కురిసిన వర్షాలతో నీటి సామర్థ్యం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 36 గ్రామాలకు సాగునీరు అందుతుంది. 4.46టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును 1954లో నిర్మాణం ప్రారంభించి 1963లో పనులు పూర్తిచేశారు. నాటినుంచి నేటి వరకు ఆధునికీకరణ పనులు జరగలేదు. నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ సూర్యాపేటకు వచ్చినప్పుడు కురిపించిన వరాల జల్లుల్లో మూసీ ఆధునికీకరణ కోసం రూ.65కోట్లను మంజూరుచేశారు. అయితే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం, టెండర్లను పిలవడంలో చాలా జాప్యం జరిగింది. ఎట్టకేల కు టెండర్లు పూర్తయి పనులు ముగిశాయి. ఆధునికీకరణ పనుల్లో కాల్వ లైనింగ్‌, ఇరువైపు లా తూములు, షట్టర్లు బిగించారు. దీంతో నీటి వృథా చాలా వరకు తగ్గింది. తూములు, షట్టర్లు లేకపోవడం వల్ల ఎక్కడ నీరు అక్కడ వృథా అ య్యింది. వేములపల్లి మండలం చివరి ఆయకట్టు రైతులకు సాగు నీరు చేరలేదు. కాల్వ వెం ట ఆరు మీటర్ల వెడల్పుతో సీసీ బెడ్‌, లైనింగ్‌ నిర్మాణం, డిస్ర్టిబ్యూటరీ కాల్వలకు 6.9 మీటర్ల వెడల్పుతో లైనింగ్‌, కాల్వ వెంట కంపచెట్లను తొలగించడం ఈ ఆధునికీకరణ పనుల్లో ఉన్నా యి. కాల్వ లైనింగ్‌, సీసీ బెడ్‌తో వేయాల్సి ఉండ గా కాల్వ పూడికతీయడంలో వచ్చిన రాళ్లను వృథా చేయవద్దని అదే రాళ్లను కాల్వ లైనింగ్‌కు వినియోగించారు. దీంతో ఆలస్యమైంది.

మూసీ ఆయకట్టు కింద 30వేల ఎకరాలు

మూసీ ప్రాజెక్టు కింద కుడి, ఎడమ కాల్వల పరిధిలో సుమారు 30వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఆధునికీకరణ పనులు చేపడితే కుడి కాల్వ కింద 14,720 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 15,290 ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఆధునికీకరణ ద్వారా 34 గ్రామాల రైతులకు వ్యవసాయానికి సాగునీరు అందించవచ్చు.

ఖరీ్‌ఫలో సాగునీరు అందిస్తాం : చంద్రశేఖర్‌, డీఈ

వానాకాలంలో మూసీ ఆయకట్టుకు సా గునీరు అందిస్తాం. మూసీ నీటి సామర్థ్యం 645 అడుగులు కాగా, ఇప్పటికే 630 అడుగులవద్ద నీటి మట్టం ఉంది. జూన్‌లో ఎగు వ నుంచి వర్షాలు వస్తే ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల నిరంతరాయంగా సాగు నీరు అందించవచ్చు.

Updated Date - May 11 , 2026 | 12:12 AM