సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్ ఎక్కడ ?
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:40 PM
చందంపేట, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చందంపేట మం డలంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అధికారులు ప్రొటోకాల్‌ను పూ ర్తిగా పక్కన పెట్టారు.
చందంపేట, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చందంపేట మం డలంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అధికారులు ప్రొటోకాల్‌ను పూ ర్తిగా పక్కన పెట్టారు. ఏ సమావేశంలోనైనా అధికారికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు మాత్రమే పాల్గొనాలి. కానీ చందంపేట మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సమావేశంలో ఎలాంటి అధికారం లేని వ్యక్తులు కూడా వేదికపై కూర్చొని కార్యక్రమాల్లో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి మండలంలో ఉన్న 15 మంది మహిళా సర్పంచులు హాజరుకావాల్సి ఉంది. ఈ సమావేశానికి మురుపునూతల గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ మన్మథారెడ్డి ఒక్కరే హాజరయ్యారు. ఎలాంటి హోదా లేకపోయినా నేరేడుగొమ్ము మండలానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి భర్త ముక్కామళ్ల వెంకటయ్య, కంబాలపల్లి సర్పంచ్ భర్త ఏడ్పుల గోవింద్ యాదవ్ వేదికపై కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రొటోకాల్‌కు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రొటోకాల్‌ను పాటించాలని ప్రజలు కోరుతున్నారు.