Share News

‘ఉపాధి’ కూలీలకు వసతులేవీ..?

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:31 AM

(ఆంధ్రజ్యోతి-గుండాల): గ్రామాల్లో కూలీల వలసలను నివారించి వారికి ఉపాధి పనులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ (జాతీయ ఉపాధి హామీ పథకాన్ని) ప్రవేశ పెట్టింది.

‘ఉపాధి’ కూలీలకు వసతులేవీ..?

(ఆంధ్రజ్యోతి-గుండాల):

గ్రామాల్లో కూలీల వలసలను నివారించి వారికి ఉపాధి పనులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ (జాతీయ ఉపాధి హామీ పథకాన్ని) ప్రవేశ పెట్టింది. గ్రామాల్లో ఉపాధి లభించడంతో పేదలు రోజూ పనులకు వెళ్తున్నారు. కానీ పని ప్రదేశంలో కనీస సదుపాయాలు లేకపోవడంతో కూలీలు అవస్థలు పడుతున్నారు. ప్రారంభంలో కూలీలకు గడ్డపారలు, మెడికల్‌ కిటు,్ల టెంట్లు, తాగునీరు లాంటి వసతులను కల్పించారు. రాను రాను వారికి ఎలాంటి సదుపాయాలను కల్పించడం లేదు. కనీసం తాగడానికి మంచినీరు, సేద తీరడానికి నీడ సౌకర్యం కూడా లేక పోవడంతో కూలీలు అల్లాడి పోతున్నారు. ఇది వరకు కూలీలు సొంతంగా గడ్డపార సమకూర్చుకుంటే రోజుకు రూ.10, తాగునీటి కోసం రూ.5 అందజేసే వారు ప్రస్తుతం పని ప్రదేశంలో వసతులు లేకపోవడంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా ర్చి కావడంతో ఇటీవల ఎండలు తీవ్రగా ఉండడంతో కూలీలు అస్వస్థతకు గురవుతున్నారు. ఎండ తీవ్రతకు భయపడి కూలీలు పనులు చేయడాని కి ముందుకు రావడం లేదు.

అమలుకు నోచని ప్రభుత్వ ఆదేశాలు

వేసవిలో మార్చి నుంచి జూన వరకు కూలీలకు తాగునీరు, వడదెబ్బ తగలకుండా నీడకోసం టెంట్లు వేసి రక్షణ కల్పించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ జి ల్లాలో ఎక్కడ కూడా అమలుకు నోచుకోవడం లేదు. అలసటగా ఉంటే పొదలు, చెట్ల చాటున సేద తీర్చుకోవల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం నీటిని సరఫరా చేయడానికి ఒక మేట్‌ను నియమిస్తే కూలీలకు సౌకర్యంగా ఉంటుంది. మండల వ్యాప్తంగా ఉపాధి కూలీలకు వసతులు లేక పోవడంతో ఎండలోనే సేద తీరుతున్నారు. కూలీలు భోజనం చేయడానికి అలసటగా ఉన్నప్పుడు సేద తీరడానికి ప్రభుత్వం గతంలో గుడారాలు, మెడికల్‌ కిట్లు పంపిణీ చేసేది. వాటిని క్షేత్ర సహాయకులు ప్రతి రోజు పని ప్రదేశానికి తీసుకువెళ్లి వసతి కల్పించేవారు. ఎనిమిదేళ్లుగా గుడారాలు, మెడికల్‌ కిట్లు ఇవ్వడం మరిచారు. కిట్టులో అయోడిన బాటిల్‌, బ్యాండేజి, దూది, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో పాటు కొన్నిరకాల మాత్రలు ఉండేవి. పనికి ఉపయోగించే పరికరాలు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం స్పందించి మెడికల్‌ కిట్లు గుడారాలు ఏర్పాటు చేయాలని కూలీలు కోరుతున్నారు.

Updated Date - Mar 30 , 2026 | 12:31 AM