Share News

కోఆప్షన్ల ఎన్నికలు ఎప్పుడో?

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:59 PM

మునిసిపల్‌ ఎన్నికలు ముగిసి మూడు నెలలు దాటింది. పాలకవర్గాలు కొలువుదీరినా కోఆప్షన పదవుల కు మోక్షం కలగడం లేదు. ఎప్పుడు కో ఆప్షన పదవులకు ఎన్నికలు జరుగుతా యా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

కోఆప్షన్ల ఎన్నికలు ఎప్పుడో?

మునిసిపల్‌ ఎన్నికలు ముగిసి మూడు నెలలు దాటింది. పాలకవర్గాలు కొలువుదీరినా కోఆప్షన పదవుల కు మోక్షం కలగడం లేదు. ఎప్పుడు కో ఆప్షన పదవులకు ఎన్నికలు జరుగుతా యా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కౌన్సిలర్‌ టికెట్‌ ఆశించి రాని వారు, కోఆప్షన పదవిపై ఆశతో ఉన్నా రు. ఒకే వార్డులో ఇద్దరు అభ్యర్థులు బలంగా ఉండడంతో వారిలో ఒకరిని బుజ్జగించి విరమింపచేశారు. కాగా కో ఆప్షన్ల ఎన్నికపై మునిసిపల్‌ అదికారు లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

- (ఆంధ్రజ్యోతి-సూర్యాపేట టౌన)

జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగరర్‌, తిరుమలగిరి, నేరేడుచర్ల మునిసిపాలిటీల ఉన్నాయి. తిరుమలగిరి, నేరేడుచర్లలో ఇప్పటికే కోఆప్షనల ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన సూర్యాపేటలో 48 వార్డులకు నాలుగు కోఆప్షన పోస్టులు, కోదాడలో 4, హుజూర్‌నగర్‌లో 4 పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మొత్తం ఐదు మునిసిపాలిటీల్లో 20 కోఆప్షన పదవులు ఉండగా 8 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన 12 పదవులు కోసం నాయకులు ఎదురుచూస్తున్నారు. మునిసిపాలిటీ నిబంధనల ప్రకారం పాలకవర్గం ప్రమాణస్వీకారం అనంతరం రెండు నెలల్లో కోఆప్షన మెంబర్లను ఎన్నుకోవాలి. అయితే మూడు నెలలు గడుస్తున్నా నేటికీ ఆ ప్రక్రియ సూర్యాపేట జిల్లాలో పూర్తిస్థాయిలో ముందుకు సాగడం లేదు.

నిబంధనలు ఇవి

మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి కోఆప్షన సభ్యుల ఎన్నికపై ప్రత్యేక ప్రకటన జారీ చేస్తారు. సభ్యుల పేర్లను కౌన్సిలర్లు ప్రతిపాదించాలి. ఆ తర్వాత వారిని ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు. వీరిని అధికారంగా ధ్రువీకరిస్తారు. ఎన్నికైన సభ్యులు మునిసిపల్‌ కౌన్సిల్‌లో కౌన్సిలర్ల తో పాటు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయవ చ్చు. అయితే వీరు ఎలాంటి ఓటింగ్‌లోనైనా పాల్గొనేందుకు వీలులేదు. పాలకవర్గం ఉన్నంతకాలం వీరి పదవులు కొనసాగుతాయి. కోఆప్షన సభ్యులు ఖచ్చితంగా విద్య లేదా వైద్యంలో లేదా ఇంజనీరింగ్‌, న్యాయ, సామాజిక, సేవా వంటి రంగాల్లో అనుభవం ఉండాలి. మునిసిపాలిటీ చట్టాలపై అవగాహన కలిగి ఉన్న వారికే ప్రాధాన్యమిస్తారు. అంతేకాక గతంలో మునిసిపల్‌ కౌన్సిలర్లుగా పనిచేసిన వా రికి ఆయా పార్టీలు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. ము నిసిపల్‌ బిల్లుల ఆమోదంలో కోఆప్షన సభ్యులు చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపే అవకాశం ఉంది.

త్వరలో ఎన్నిక పూర్తిచేస్తాం

సూర్యాపేట మునిసిపాలిటీలో కోఆప్షన మెంబర్‌ ఎన్నిక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తాం. దీనిపై రాజకీయ నాయకులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం. త్వరలోనే నోటిఫికేషనను జారీ చేస్తాం.

- సీహెచ హన్మంతరెడ్డి, సూర్యాపేట మునిసిపల్‌ కమిషనర్‌

పంచాయతీల్లోనూ ఐదు నెలలుగా..

(ఆంధ్రజ్యోతి-చండూరు): పంచాయతీ ఎన్నికల ము గిసి ఐదునెలలు గడిచింది. పాలకవర్గాలు కొలువుదీరి ప్ర జా సమస్యలు పరిష్కరించడంలో, అభివృద్ధి పనులు చేపట్టడంలో నిమగ్నయ్యారు. అయినా ఇప్పటివరకు కోఆప్షన సభ్యుల నియామక ప్రక్రియ చేపట్టలేదు. దీంతో ఆశావహులకు ఎదురుచూపులు తప్పడంలేదు. నల్లగొండ జిల్లా ల్లో 33మండలాలు,869 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఒక్కోపంచాయతీకి ముగ్గురు చొప్పున 2,607మందిని కోఆప్షన సభ్యులుగా ఎన్నుకోవాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో పరపతి ఉన్న నాయకులు కన్ను ఇప్పుడు కోఆప్షన పదవులపై పడింది. వాటిని దక్కించుకోవడం కోసం ప్రధాన నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కోఆప్షన అంటే సలహాదారులుగానే...

కోఆప్షన సభ్యులకు గ్రామసభల్లో, పంచాయతీ సమావేశాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. వార్డు సభ్యులతో సమానంగా హోదా, ప్రొటోకాల్‌ కూడా ఉంటుంది. వీరు సమావేశాల్లో పాల్గొని చర్చలు, సూచనలు చేయవచ్చు. కానీ ఏదైనా తీర్మాణంపై ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు. కేవలం సలహాదారుడిగానే ఉండాల్సి ఉంటుంది.

ఎంపికకు అర్హతలు

గ్రామాల్లో మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలిని తప్పకుండా ఎంపిక చేయాలి. గ్రామ అవసరాల రీత్యా స్థలం ఇచ్చిన దాతను కోఆప్షన సభ్యుడిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన వారిని ఎంపిక చేయాలి.

Updated Date - Jun 23 , 2026 | 11:59 PM