Share News

అన్నీ కట్టేశాం, ఇంకా బాకీ ఏంటీ?

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:27 AM

మేం తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లించాం, అయినా బాకీ చూపిస్తున్నారంటూ మహిళా సంఘ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పీక్లాతండాలో సోషల్‌ఆడిట్‌ బృందం పర్యటించింది.

అన్నీ కట్టేశాం, ఇంకా బాకీ ఏంటీ?
మహిళా సంఘాల సభ్యులతో సమావేశమైన ఆడిట్‌ అధికారులు

చింతలపాలెం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): మేం తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లించాం, అయినా బాకీ చూపిస్తున్నారంటూ మహిళా సంఘ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పీక్లాతండాలో సోషల్‌ఆడిట్‌ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో తండాలో రూ.10లక్షలు లబ్ధిదారుల మీద బాకీ ఉన్నట్లు ప్రకటించగా మహిళాసంఘాల సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రుణాలు చెల్లించినా అధికారుల నిర్లక్ష్యంతో తాము బకాయిదారులుగా మిగిలిపోయామన్నారు. మూడు నెలలకు ఒక్కసారైనా తనిఖీలు చేపడితే అక్రమాలకకు అడ్డుకట్టపడేదని సూచించారు. తప్పులను సరిచేస్తామని వీవోలు రాతపూర్వకంగా ఆడిట్‌ బృందానికి హామీఇచ్చారు. కార్యక్రమంలో చింతలపాలెం సర్పంచ రామకోటిరెడ్డి, పీక్లానాయక్‌తండా సర్పంచ లకావత సైదులు, గ్రామకార్యదర్శులు, ఆడిటర్లు, స్త్రీనిధి అసిస్టెంట్‌ మేనేజర్‌, సీసీలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 12:27 AM