Share News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:58 PM

నిడమనూరు/ తిరుమలగిరి(సాగర్‌), ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తానని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

నిడమనూరు/ తిరుమలగిరి(సాగర్‌), ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తానని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిడమనూరు తహసీల్దార్‌ కా ర్యాలయ ఆవరణలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 49 మంది లబ్దిదారులకు, తిరుమలగిరి (సాగర్‌) రైతువేదిక వద్ద 33 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల మొదలకొని ఇటీవల స్థానిక ఎన్నిక ల్లో నియోజకవర్గ ప్రజలు తనపై ఆదరాభిమానాలను చూపిస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించేలా ఆదరించారని అన్నారు. అందుకు తగ్గట్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ముం దుకు సాగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్న తమ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. నిడ మనూరులో తహసీల్దార్‌ జంగాల కృష్ణయ్య, ఎంపీడీవో హిమబిందు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంకతి సత్యం, నందికొండ మట్టారెడ్డి, కొండా శ్రీనివాస్‌రెడ్డి, శేషరాజు సంధ్యాశ్రీనివాస్‌, బైరెడ్డి వల్లభ్‌రెడ్డి, గడ్డం గోవిందరెడ్డి, రూపని కృష్ణయ్య, ఆలంపల్లి కృష్ణ, మెరుగు శ్రీనివాస్‌, బుర్రి వెంకన్న, సలికంటి సత్యం, చర్క శ్రీను, ధనావత్‌ కిషోర్‌నాయక్‌, కోట్ల సైదులు, తిరుమలగిరి (సాగర్‌)లో హాలియా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ అనిల్‌, మాజీ ఎంపీపీ ఆంగోతు భగవాన్‌నాయక్‌, సర్పంచులు పగడాల పున్నమ్మ, ఆంగో తు గోపాల్‌నాయక్‌, నాంపల్లి సైదులు, నాయకులు గడ్డం సాగర్‌రెడ్డి, శాగం రాఘవరెడ్డి, శాగం నాగిరెడ్డి, బొమ్ము గురునాథం, ఆంగోతు భద్రుడునాయక్‌, సైదులు, డీలర్‌ బాలు, భద్రునాయక్‌, జవహర్‌లాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 11:59 PM