లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తాం
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:21 AM
మేళ్లచెర్వు, ఫిబ్రవరి18(ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో నాగార్జున ప్రాజెక్టు కాల్వలతో సం బంధం లేకుండా లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామని భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
మేళ్లచెర్వు, ఫిబ్రవరి18(ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో నాగార్జున ప్రాజెక్టు కాల్వలతో సం బంధం లేకుండా లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామని భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభులింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం స్వామి వారిని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దర్శించుకున్నారు. అర్చకులు ఆల య మర్యాదలతో, పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. అనంతరం ఆల య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కబడ్డీ, ఎద్దుల పందేల పోటీలను ప్రారంభించి మాట్లాడారు. అదు ను ప్రకారం లక్ష ఎకరాలకు నీటిని అందించేందుకు కృష్ణానదిపై రూ.2,500 కోట్లతో వివిధ ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఇరిగేషన అధికారులు, ఈవో నాగేండ్ల శంభిరెడ్డి, గ్రామ సర్పంచ బచ్చు పద్మాశ్రీనివా్‌సరెడ్డి, పోషం నర్సిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, కొట్టె సైదేశ్వరరావు, శాగంరెడ్డి గోవిందరెడ్డి, కందిబండ సర్పంచ గాయం త్రివేణీగోపిరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు శెట్టి రామచందర్‌రావు, ఎద్దుల, కబడ్డీ పోటీల నిర్వహణ కమిటీ సభ్యులు పసుపులేటి నాగేశ్వరరావు పోషం వీరారెడ్డి పాల్గొన్నారు.
నాలుగో రోజు హోరాహోరీగా ఎద్దుల పందేలు
ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఎద్దులపందేలు, నాలుగో రోజు బుధవారం హోరాహోరీగా కొనసాగుతున్నాయి. పందేలు తిలకించేందుకు చుట్టు పక్కల మండలాల నుంచి అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి వరకు జరిగిన న్యూ కేటగిరి విభాగంలో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలానికి చెందిన మంగు రమాదేవికి చెందిన గిత్తలు, నిర్ణీత 20 నిమిషాల సమయంలో 5367.2 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిగా రూ.90 వేలు, ప్రకాశం జిల్లా నాగుప్పలపాడు మండలం, మంచిర్యాల గ్రామానికి చెందిన పుచ్చకాయల శేషాద్రి చౌదరి గిత్తలు నిర్ణీత సమయంలో 5,250 అడుగుల దూరాన్ని లాగి, ద్వితీయ స్థానంలో రూ. 80 వేలు బహుమతిని గెలుచుకున్నాయి. ఈ విభాగంలో పది జతలు పాల్గొనగా, పది జతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
సబ్ జూనియర్ విభాగంలో,.
సబ్ జూనియర్ విభాగానికి పోటీలు బుధవారం ఉదయం నిర్వహించగా, గుంటూరు జిల్లా పత్తిప ాడు మండలం, పెద్దగొట్టిపాడు గ్రామానికి చెందిన గరికపాటి లచ్చయ్య చౌదరి గిత్తలు నిర్ణీత సమయం 20 నిమిషాల వ్యవధిలో 3,293.10 అడుగుల దూరాన్ని లాగి, మొదటి బహుమతిగా రూ.90 వేలు గెలుచుకున్నాయి. బాపట్ల జిల్లా గుంటూరు మం డలం, వేటపాలెం గ్రామానికి చెందిన ఆర్‌కే బుల్స్ 3,444 అడుగుల దూ రాన్ని లాగి, ద్వితీయ స్థానాల్లో రూ. 80 వేలు గెలుచుకోగా. ఈ వి భాగంలో 12 జతలు పోటీలో ఉన్నాయి. బుధవారం సాయంత్రం జూనియర్ విభాగానికి పోటీలు నిర్వహించగా, గురువారం సీనియర్ విభాగానికి పోటీలు నిర్వహించి విజేతకు మహీంద్ర ట్రాక్టర్‌ను అందజే యనున్నారు. ఆలయ ప్రాంగణంలో కబడ్డీ పోటీలు, సాంఘిక నాటికప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
చింత్రియాలలో ..
చింతలపాలెం : మండలం చిత్రియాల గ్రామంలో నిర్వహిస్తున్న ఎ ద్దుల పందేలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. జాతరలో బుధవారం నిర్వహించిన పోటీల్లో న్యూ కేటగిరి విభాగంలో మొత్తం పది జతల ఎద్దులు పాల్గొన్నాయి. బండను లాగడంలో ఎద్దులు చూపిన ప్రదర్శన చూపరులను కట్టుపడేసింది. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 8 జతలు బహుమతులు కైవసం చేసుకున్నాయి.