పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:28 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేస్తామని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మిర్యాలగూడలో గుమస్తాకాలనీ వద్ద రూ.33కోట్లతో నిర్మించిన 560 డబుల్ బెడ్‌రూం ఇళ్లను శాసనమండ లి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు.
చరిత్రలో నిలిచిపోయేలా ఇరిగేషన్ పనులు
రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మిర్యాలగూడలో గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
మిర్యాలగూడ, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేస్తామని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మిర్యాలగూడలో గుమస్తాకాలనీ వద్ద రూ.33కోట్లతో నిర్మించిన 560 డబుల్ బెడ్‌రూం ఇళ్లను శాసనమండ లి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచేపోయేలా ఇరిగేషన్ పనులు చేపడుతోందన్నారు. గత ప్రభుత్వం పూర్తి చేయని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామన్నారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరందించే డిండి లిఫ్ట్ పనులు వేగవంతం చేస్తామన్నారు. జిల్లాలోని బస్వాపూర్, ధర్మారెడ్డికాల్వ, పిలాయిపల్లి, మిర్యాలగూడ నియోజకవర్గంలో తోపుచర్ల, కేశవాపూర్, కొండ్రపోలు, దున్నపోతులగండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేసి, సాగు, తాగు నీరు అందిస్తామన్నారు. దామరచర్ల మండలంలో శాంతినగర్, వేములపల్లి మండలంలో రావులపెంట వాగులపై చెక్‌డ్యామ్‌ను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వజీరాబాద్ మేజర్ కాల్వ లైనింగ్ పనులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందజేయాలి : గుత్తా
డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 3,600 డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో అసంపూర్తిగా మిగిలిన 1000 ఇళ్లను పూర్తిచేసి పేదలకు అందించేలా చూడాలన్నారు. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్ట్‌లలో ఒకటైన ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే గ్రావిటీపై నల్లగొండ, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందించవచ్చన్నారు.
రైల్వే అండర్‌పాస్ ఏర్పాటు : ఎంపీ రఘవీర్
దామరచర్ల-రాజగట్టు రైల్వే అండర్‌పాస్ నిర్మాణాన్ని త్వరలో చేపట్టనున్నట్లు నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభు త్వం పేదలను ఆదుకునేందుకు కృషిచేస్తోందన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కాలనీకీ జ్యోతిరావుపూలే పేరుపెట్టడం మంచి పరిణామమన్నారు. కాలనీలో పిల్లలు చదువుకునేందుకు ఎంపీ నిధులతో లైబ్రరీ, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు.
పేదల సొంతింటి కల నెరవేరింది : కలెక్టర్
మిర్యాలగూడలో 7.24 ఎకరాల్లో 24 బ్లాక్‌లలో నిర్మించిన 560 ఇళ్లను దీపావళి కానుగా పేదలకు ఇ్వడంతో వా రి కల నెరవేరిందని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కాలనీలో అంతర్గత రహదారులు, డ్రైనే జీ, తాగునీరు, పార్కు, విద్యుత్, దేవాలయంవంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. రూ.33కోట్లతో నిర్మించిన ఇళ్లను పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లతోపాటు మిర్యాలగూడలో సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయం, అడవిదేవులపల్లి తహసీల్దార్ కార్యాలయ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్‌చంద్రపవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీవో రమణారెడ్డి, డీసీ సీ అధ్యక్షుడు పున్నా కైలా్‌షనేత, మునిసిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధాబాలకృష్ణ, వైస్‌చైర్‌పర్సన్ గుడిపాటి శిరీషనవీన్, సర్పంచ్ మంగమ్మ గోవింద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.