పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:44 AM
సూర్యాపేట టౌన, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ తేజ్‌సనందలాల్‌పవార్ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లాకేంద్రంలో శుక్రవారం ప్రారంభించి, అనంతరం ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.
సూర్యాపేట టౌన, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ తేజ్‌సనందలాల్‌పవార్ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లాకేంద్రంలో శుక్రవారం ప్రారంభించి, అనంతరం ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి అవసరం ఉందన్నారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మార్చి ఈ ఆర్థిక సంవత్సరానికి ముంపు కావడంతో పట్టణాల్లో పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలన్నారు. అనంతరం ప్రజలతో పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన మొరిశెట్టి నివేదితలక్షాది, కమిషనర్ సీహెచ హన్మంతరెడ్డి, వైస్‌చైర్మన షఫిఉల్లా, ఈఈ కిరణ్, శానిటరీ ఇనస్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మంచిపేరు సుస్థిరం చేసుకోవచ్చు
సూర్యాపేటరూరల్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో నూతన ప్రజాప్రతినిధులు ప్రజలలో మంచిపేరు సుస్థిరం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని కలెక్టర్ తేజ్‌సనంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం మండలంలోని బాలెంల గ్రామపంచాయతీలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. 99 రోజుల కార్యక్రమంలో చివరి వరకు ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులకు చేరువ చేసేలా కృషి చేయాలన్నారు. గ్రామస్థులతో కలెక్టర్ ముచ్చటించి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలన్నారు. అంగనవాడీ కేంద్రంలో పిల్లల భోజనవసతులు అడిగి తెలుసుకున్నారు. పల్లె దవాఖానాలో ఏఎనఎంలతో ముచ్చటించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, ఆర్డీవో వేణుమాధవ్, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో బాలకృష్ణ, ఎంపీవో లింగారెడ్డి, సర్పంచ గాలి మమత, ప్రధానోపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.