నీటిని పొదుపుగా వాడుకోవాలి
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:09 AM
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీన పడ్డాయని మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్, గరిడేపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పనుల పరిశీలన చేసిన అనంతరం ఆయన మాట్లాడా రు.
ఎల్‌నినోతో అంతటా వర్షాభావం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీన పడ్డాయని మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్, గరిడేపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పనుల పరిశీలన చేసిన అనంతరం ఆయన మాట్లాడా రు. వానాకాలంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలన్నారు. నీటి నిర్వహణ అత్యంత కీలకమన్నారు. దేశంలో జూన్ నెలలోనే 40శాతం వర్షపాతం తక్కువగా నమోదైందన్నారు. దీనికి ఎల్‌నినో ప్రభావమే కారణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌లో 22శాతం వర్షపాతం లోటుగా ఉందన్నారు. విత్తనాలు నాటడం కూడా ఆలస్యమవుతోందన్నారు. మహారాష్ట్రలోనూ వర్షాలు తక్కువగా నమోదు అవుతున్నాయని, గోదావరి జలాల ప్రవాహం ఆలస్యమ య్యే అవకాశం ఉందన్నారు. అధికనీరు అవసరమయ్యే పంటలకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగయ్యే పంటలను వేసుకోవాలన్నారు. ఎండలను తట్టుకునే పం టల సాగుపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. రిజర్వాయర్లలోని నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముందు గా తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్య లు చేపడుతోందన్నారు. సరైన ప్రణాళిక, నీటి పొదుపు తో సవాళ్లను అధికమించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పండగలా మార్చిందన్నారు. ఏడు రకాల సన్నాలకు ప్రభుత్వం బోనస్ అందించిందన్నారు. మంత్రి పర్యటనలో కలెక్టర్ తేజ్‌సనందలాల్‌పవార్, ఎస్‌పీ నర్సింహ, ఆర్డీవో శ్రీనివాసులు, వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి తో పనిచేస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ తేజ్‌సనందలాల్‌పవార్, ఎస్పీ నర్సింహతో కలిసి శుక్రవారం హుజూర్‌నగర్ పట్టణంలో రూ.13కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల భవనాల ను పరిశీలించారు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఆగ స్టు 15న కళాశాలల భవనాలను ప్రారంభిస్తామన్నారు. విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా బోధ న చేయాలన్నారు. వచ్చే ఏడాది లోగా నిర్మాణంలో ఉన్న పాఠశాలలు, కళాశాలల భవనాలను పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్‌చైర్మన్ తన్నీరు మల్లికార్జున్‌రావు, యరగాని నాగన్న, గూడెపు శ్రీను, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ కవిత, కమిషనర్ సతీష్, గెల్లి రవి, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ చరమందరాజు, ఎస్‌ఐ నరేష్, గల్లా వెంకటేశ్వర్లు, సుంకరి శివరామ్, గంజి శివ పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ
విధి నిర్వహణలో మృతి చెందిన బాధిత కుటుంబాల కు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పలువురికి కారుణ్యనియామకపత్రాలను ఆయన అందజేశారు. బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.
పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
కోదాడ రూరల్, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైద్యసిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తిచేసి వైద్యసేవలు ప్రజలకు అందుబాటులో తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈ ఆసుపత్రిని 40 పడకలుగా మార్చడం జరిగిందన్నారు. పెరిగిన జనాభాతో పాటుగా జాతీయ రహదారిపై కోదాడ ఉండడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం రూ.26 కోట్లను మంజూరు చేయించామన్నారు. ఆసుపత్రి నిర్మాణ ప్లాన్‌ను మంత్రి పరిశీలించి పలు సూ చనలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, కలెక్టర్ తేజ్‌సనందలాల్‌పవార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మునిసిపల్ చైర్మన్ యెర్నే ని కుసుమ వెంకటరత్నంబాబు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.