Share News

యుద్ధంతో ప్రపంచానికి ముప్పు

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:36 PM

నల్లగొండ రూరల్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): యుద్ధంతో ప్రపంచ మాన వాళికి ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పు ఉందని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. టీఎస్‌ యూటీఎఫ్‌, సీఐటీయూ, నల్లగొండలోని ప్రోగ్రెస్‌ ఫోరం ఆధ్వర్యంలో ‘ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ అమెరికా యుద్ధం - ప్రపంచ శాంతికి విఘాతం’ అనే అంశంపై మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన సెమినార్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇజ్రాయిల్‌, అమెరికాలు ఇరాన్‌పై ఆక్రమిత యుద్ధం మొదలుపెట్టి 61 రోజులు పూర్తయ్యాయని అన్నారు.

  యుద్ధంతో ప్రపంచానికి ముప్పు

నల్లగొండ రూరల్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): యుద్ధంతో ప్రపంచ మాన వాళికి ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పు ఉందని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. టీఎస్‌ యూటీఎఫ్‌, సీఐటీయూ, నల్లగొండలోని ప్రోగ్రెస్‌ ఫోరం ఆధ్వర్యంలో ‘ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ అమెరికా యుద్ధం - ప్రపంచ శాంతికి విఘాతం’ అనే అంశంపై మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన సెమినార్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇజ్రాయిల్‌, అమెరికాలు ఇరాన్‌పై ఆక్రమిత యుద్ధం మొదలుపెట్టి 61 రోజులు పూర్తయ్యాయని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రపంచ రౌడీలాగా వ్యవహరిస్తూ ప్రపంచ దేశాలపై ఆధిపత్యం సాగించాలని ఆకాంక్షతో రగిలిపోతున్నారని అన్నారు. వెనిజులా అధ్యక్షుడిని అరెస్టు చేసి నిర్బంధించారన్నారు. ఇరాన్‌ వెనిజులా దేశాల్లో ఉన్న చమరు నిల్వలను ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆరాటంతో యుద్ధాన్ని ట్రంప్‌ ప్రారంభించారన్నారు. ఇరాన్‌ దేశంలో అణ్వాయుధాలు ఉన్నాయనే సాకుతో యుద్ధం ప్రారంభించిన ట్రంప్‌ 10రోజుల్లో యుద్ధం ముగుస్తుందని అన్నారన్నారు. ఇరాన్‌ అమెరికాకు లొంగిపోకుండా సాహసోపేతంగా యుద్ధం చేసిందన్నారు. ట్రంప్‌ చేస్తున్న యుద్ధంతో ఆ దేశ ప్రజలు ఆందోళన చేస్తున్నారన్నారు. యుద్ధంతో అమె రికా ఆర్థికంగా నష్టపోతుందని, యుద్ధం ఆపాలని ఆదేశ ప్రజలు కోరు తున్నా, ఆ దేశంలోని కార్పొరేట్‌ పెట్టుబడిదారుల కోసం యుద్ధాన్ని ట్రంప్‌ కొనసాగిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్య క్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ట్రంప్‌ విధానాలతో ఆర్థిక పరిస్థితుల తారుమారు అవుతున్నాయన్నారు. యుద్ధ ప్రభావంతో భారతదేశంలో కూడా సకాలంలో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, ఎరువులు దొరకక ప్రజతు ఇబ్బందులు పడుతున్నారన్నారు. యుద్ధం విరమణకు ప్రతిఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సెమినార్‌లో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హషం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, రాష్ట్ర రైతు మహిళా కన్వీనర్‌ కందాల ప్రమీల, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, రాష్ట్ర ఉపాఽ ద్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాల్లం మహేష్‌, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి కన్వీనర్‌ రాములు, టీఆర్టీఎఫ్‌ జిల్లా కార్యదర్శి తరాల పరమేష్‌, దండంపల్లి సత్తయ్య, లక్కపాక రాజు, అవుట రవీందర్‌, పెంజర్ల సైదులు, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, ఖమ్మంపాటి శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 11:37 PM