రోడ్డు ప్రమాదంలో గ్రామ కార్యదర్శి మృతి
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:52 PM
నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామ కార్యదర్శి మృతి చెందాడు. ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనుముల మండలం మారెపల్లి గ్రామానికి చెందిన, పులిమామిడి గ్రామ కార్యదర్శి అవుట మనోహర్‌రావు(59) నల్లగొండ పట్టణం చైతన్యపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు.
రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టిన గూడ్స్ వ్యాన
కనగల్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామ కార్యదర్శి మృతి చెందాడు. ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనుముల మండలం మారెపల్లి గ్రామానికి చెందిన, పులిమామిడి గ్రామ కార్యదర్శి అవుట మనోహర్‌రావు(59) నల్లగొండ పట్టణం చైతన్యపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. తన విధుల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై పులిమామిడి గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఎస్.లింగోటం స్టేజీ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా రాంగ్‌రూట్‌లో వచ్చిన గూడ్స్ వ్యాన బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో మనోహర్‌రావుకు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనోహర్‌రావు మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వివరించారు. మనోహర్‌రావు మృతికి గ్రామ కార్యదర్శుల సంఘం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.