Share News

నేటి నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:55 PM

మండలంలోని ముప్పారం గ్రామంలో కొలువైన పురాతన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 5వ తేదీ వరకు ఆరు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

 నేటి నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ముప్పారం గ్రామంలో శాలివాహనశకం నాటి ప్రాచీన ఆలయం

ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు

(ఆంధజ్ర్యోతి-నిడమనూరు)

మండలంలోని ముప్పారం గ్రామంలో కొలువైన పురాతన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 5వ తేదీ వరకు ఆరు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కాగా ప్రతిఏటా హోలీ రోజున స్వామివారి కల్యాణం నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం. కానీ హోలీ రోజున గ్రహణం ఉండడంతో ఆలయాన్ని మూసి వేస్తున్నందున మొదటిసారి ఈ ఏడాది మరుసటి రోజు స్వామివారి తిరుకల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. కల్యాణానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

ఆలయ విశిష్టత

ముప్పారం గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి 904 ఏళ్ల చరిత్ర ఉంది. శాలివాహన శకం 1122వ సంవత్సరంలో శ్రీఅలివేలుమంగా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆ లయం చారిత్రక కట్టడంగా నిలిచింది. అప్పట్లో ఆలయాన్ని పూర్తిగా రాతి స్తంభాలతో నిర్మించారు. బండరాయిపై రాతి స్తంభాలతో నిర్మించడమే ఆలయ ప్రత్యేకత. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఊరేగింపునకు ఉపయోగించే వాహనాలు సైతం చారిత్రకమైనవని చెప్పవచ్చు. 1326లో మేరెడ్డి వంశీయులైన బుచ్చిరెడ్డి లక్ష్మ మ్మ దంపతులు గాలిగోపురాన్ని నిర్మించారు. ఆలయ నిర్వహణకు కొంత మాన్యం కూడా ఏర్పాటు చేశారు. ఆలయానికి 44 ఎకరాల పైచిలుకు మాన్యం భూమి ఉంది. మాన్యం ద్వారా ఆలయానికి ఏటా కౌలు రూ పంలో ఆదాయం. వసు ్తంది. అప్పటి నుంచి ఆలయం లో నిత్యం ధూప, దీప, నైవేద్యాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ ఆలయం దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ రెండేళ్ల క్రితం వరకు మేరెడ్డి వంశీయులే ఏటా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేవారు. కానీ రెండేళ్ల క్రితం మొదటిసారి సోమారిగూడెం గ్రామానికి చెందిన యడవెల్లి వంశీయుడు విజయ్‌కుమార్‌రెడ్డిని చైర్మన్‌గా నియమించడంతో ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఉత్సవాలు ఇలా.

28న చినకోవెల నుంచి పెద్దకోవెలకు ప్రవేశం,

తొళక్కం,

మార్చి 1వ తేదీన ప్రబంద సేవాకాలం, గరుడ

సేవ పరమపదోత్సవం,

2న చాత్మర, అంకురారోహణ, హోమం,

బలిహరణం, గరుడముద్ద,

3న ఉదయం ప్రాబోదిక హోమం ఆలయం

మూసివేత(చంద్రగ్రహణం)

4న స్వామివారి ఎదుర్కోలు, తిరుకల్యాణం,

మధ్యాహ్నం భక్తులకు మహాఅన్నదానం,

సాయంత్రం గ్రామోత్సవ,

5న పూర్ణాహుతి, స్వామివారి చక్రస్నానం,

పుష్పయాగం

Updated Date - Feb 27 , 2026 | 11:55 PM