Share News

ఏడాదిలో మామూళ్లు రూ.2 కోట్లకు పైనే...

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:22 AM

రవాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థ రద్దు అధికారులకు కలిసొచ్చింది. ఒకప్పుడు ఏజెంట్ల ద్వారా మామూళ్లు అందేవి. ఏజెంట్లు కొంత తీసుకుని ఎక్కువ మొత్తం అధికారులకు ఇచ్చేవా రు.

ఏడాదిలో మామూళ్లు రూ.2 కోట్లకు పైనే...

కలిసొచ్చిన ఏజెంట్ల వ్యవస్థ రద్దు

షోరూంల నుంచే వాహన రిజిస్ట్రేషన్లు

అక్కడి నుంచే అధికారులకు మామూళ్లు

రవాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థ రద్దు అధికారులకు కలిసొచ్చింది. ఒకప్పుడు ఏజెంట్ల ద్వారా మామూళ్లు అందేవి. ఏజెంట్లు కొంత తీసుకుని ఎక్కువ మొత్తం అధికారులకు ఇచ్చేవా రు. ప్రస్తుతం షోరూం నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాగుతుండటంతో అక్కడి నుంచే అధికారులకు మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా 1,200 వివిధ వాహనాల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, లైసెన్స రెన్యువల్‌, ఫిట్‌నె స్‌ సర్టిఫికెట్ల కోసం వచ్చే వారి నుంచి ఒక్కో సేవ కు ఒక్కో రేటు నిర్ణయించి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారు. ఇలా ఏడాదిలో రూ. 2 కోట్లకు పైగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

- (ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)

ఆర్టీవో, ఎంవీఐ కార్యాలయాల్లో జోరుగా మామూళ్ల దందా నడుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏజెంట్‌ వ్యవస్థ ఉన్నప్పు డు వారి ద్వారా డబ్బులు ముట్టేవి. ఆ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడంతో అధికారులకు పంటపండింది. కార్లు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఆయా షోరూంల వారే రిజిస్ట్రేషన ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇక మామూళ్లు కూడా వారే నేరుగా అదికారులకు, సిబ్బందికి అందజేస్తున్నారు. ఏజెంట్‌ల వ్యవస్థ ఉన్నప్పుడు ఒక ద్విచక్రవాహనం రిజిస్ర్టేషన చేయాలంటే వాహనదారుడి నుంచి రూ.550 వసూల్‌ చేసేవారు. అందులో రూ.300 వరకు కార్యాలయంలో ముట్టచెప్పి రూ.250 ఏజెంట్‌లు తీసుకునేవారు. ప్రస్తుతం షోరూంల నుంచి నేరుగా రూ.550 అందుతున్న ట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు, సిబ్బందికే లాభదాయంకంగా మారింది. ఏజెంట్‌ల వ్యవస్థ లేనందున ఏవరైనా నేరుగా కార్యాలయానికి వచ్చి తమ సేవలు వినియోగించుకోవచ్చునని అధికారు లు చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడంలేదు. నేరుగా వచ్చిన వారికి అది, ఇది లేదంటూ కొర్రీలు పెడుతున్నట్లు ఒక వాహనదారుడు వాపోయాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు అన్నిపత్రాలు అందజేసి రిజిస్ర్టేషన, లైసెన్సలకు వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా రవాణా అధికారి కార్యాలయం ఉండగా కోదాడలో మోటార్‌ వెహికిల్‌ ఇనస్పెక్టర్‌ కార్యాలయం ఉంది. ఈ రెండు కార్యాలయాలు మాత్రమే ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని మేళ్లచెర్వు, పాలకవీడు, చింతలపాలెం మండల కేంద్రంలోని పలు గ్రామాలకు చెందిన వారు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ర్టేషనకు కోదాడకు రావాల్సిందే. అదేవిధంగా లైసెన్సలు, ఫిట్‌నె్‌సలకు కూడా కోదాడకు రావాల్సిన అవసరం ఉంది. హుజూర్‌నగర్‌లో కూడా ఎంవీఐ కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లంచాల మోత....

రవాణా శాఖలో ప్రతి పనికీ ఒక ధరను నిర్ణయించారు. ప్రభు త్వం నిర్ణయించిన ధర ప్రకా రం ఛలానా చెల్లించాలి. ఆ తర్వాత. కార్యాలయాల్లో మామూళ్లు అందజేయాలి. కారుకు రూ.1,000 నుంచి రూ.1,500, ద్విచక్రవాహనానికి రూ.400 నుంచి రూ.550 వరకు చెల్లించాల్సి నిర్ణయించినట్లు సమాచచారం. టూవీలర్‌, ఫోర్‌ విలర్‌ లైసెన్స కోసం రూ.500, ట్రాక్టర్‌కు రూ.800 నుంచి రూ.1,000 వరకు వసూల్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఫిట్‌నె్‌సకు రూ.350 నుంచి రూ.1,000దాకా ట్యాక్సీప్లేట్‌ కారుకు రూ.500 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫిట్‌నెస్‌ తనిఖీ చేస్తారు. 7 ఏళ్లు దాటిన తర్వాత వాహనాన్ని ప్రతీ సంవత్సరం ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఆటోలు, ట్రాక్టర్‌లు, బస్సులు, లారీలు, మినీట్రాన్సఫోర్ట్‌ వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు తప్పక తీసుకోవాలి. లేకుంటే వాహనాలు తనిఖీ చేసే సమయంలో పట్టుపడితే అపరాద రుసం చెల్లించాల్సి ఉంటుంది.

ప్రతినెలా 1,200వాహనాల రిజిసే్ట్రషన

జిల్లాలోని సూర్యాపేట ఆర్టీవో, కోదాడ ఎంవీఐ కార్యాలయాల్లో ప్రతినెలా సుమారుగా 1,200 వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మోటారు సైకిళ్లు 733, ట్రాక్టర్లు 178, ట్రాక్టర్‌ ట్రైలర్స్‌ 95, కార్లు 70, ఆటోలు 63, బస్సులు 38, హార్వేస్టర్‌ 1, స్టేజీ క్యారేజ్‌ బస్సులు రెండు దాకా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఒక నెల తక్కువ, మరో నెల ఎక్కువగా రిజిస్ర్టేషనలు జరిగే అవకాశం ఉంది. ఇక లైసెన్సల విషయానికి వస్తే ప్రతి నెలా సుమారుగా లైట్‌ మోటారు వెహికిల్‌ లైసెన్సల కోసం 536 మంది మోటారు సైకిళ్ల కోసం 552, ట్రాక్టర్లకు 118, హెవీ మోటార్‌ వెహికిల్స్‌ 31, ఇతర వాహనాలకు చెందిన యజమానులు 114 మంది లైసెన్సలు తీసుకుంటారు. ఆనలైనలో దరఖాస్తులు చేసుకోవడానికి సౌకర్యాలు ఉన్నా ఎక్కువ మందికి దానిపై అవగాహన లేకపోవడంతో వినియోగించడంలేదు. ప్రతి నెలా రిజిస్ట్రేషన్లు, లైసెన్సలు, వివిధసేవలకు సూర్యాపేట, కోదాడ రవాణాశాఖ కార్యాలయంలో రూ.20 కోట్ల దాకా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తోంది. ఇక అధికారుల, సిబ్బంది మామూళ్లు మామూలుగానే ఉన్నాయి.

ఎటువంటి మామూళ్లు తీసుకోవడంలేదు

తమ కార్యాలయంలో ఎటువంటి మామూళ్లు తీసుకోవడంలేదు. కొంతమంది పనికట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ద్విచక్రవాహనం, ట్రాక్టర్‌ షోరూంల నుంచి సిబ్బంది లంచాలు తీసుకున్నట్లు తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.

-జయప్రకా్‌షరెడ్డి, ఇనచార్జీ ఆర్టీవో

Updated Date - Mar 04 , 2026 | 12:22 AM