Share News

పంచాయతీలో నకిలీ చలాన్ల కలకలం

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:43 PM

కొండమల్లేపల్లి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పంచాయతీలో నకిలీ చ లాన్లు కలకలం సృష్టించింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పట్టణానికి చెందిన దూదిమెట్ల శ్రీనివా్‌స (కాంట్రాక్టరు), బినామీ పేర్లతో గతంలో సంత కాంట్రాక్టు పొందాడు

  పంచాయతీలో నకిలీ చలాన్ల కలకలం

పంచాయతీలో నకిలీ చలాన్ల కలకలం

కొండమల్లేపల్లి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పంచాయతీలో నకిలీ చ లాన్లు కలకలం సృష్టించింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పట్టణానికి చెందిన దూదిమెట్ల శ్రీనివా్‌స (కాంట్రాక్టరు), బినామీ పేర్లతో గతంలో సంత కాంట్రాక్టు పొందాడు. అయితే 2025-26(1.4.2025 నుంచి 31.3.2026) ఏడాదికి రూ.1.22 కోట్లకు కాంట్రాక్టు దక్కించుకున్నాడు. కానీ 2024-25 సంవత్సరానికి శ్రీనివాస్‌ పేరుతో కాంట్రాక్టు పొందగా రూ.20లక్షలు, 2025-26 సంవత్సరంలో శ్రీనివా్‌స(బినామీ) పేరుతో రూ.40 లక్షలు చెల్లించలేదు. దీంతో కొత్త పాలకవర్గం బకాయి మొత్తాన్ని చెల్లించాలని కాంట్రాక్టర్‌పై ఒత్తిడి చేశారు. సదరు కాంట్రాక్టర్‌ మొత్తం రూ.60లక్షలకు మార్చిలో పలుమార్లు దేవరకొండ ఎస్‌బీఐ బ్రాంచికి చెందిన ఆరు నకిలీ స్టాంప్‌ లతో చలాన్లు తయారు చేసి గ్రామపంచాయతీ కార్యాలయంలో అందజేశాడు. ఆ చలాన్లు డబ్బులు పంచాయతీ ఖాతాలో జమ కాలేదు. దీంతో కాంట్రాక్టర్‌పై అనుమానం వచ్చి నార్కట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి అవి నకిలీ చలాన్లుగా ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. చలాన్లకు సంబంధించిన నగదు గ్రామపంచాయతీ బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో అనుమానం వచ్చిన పాలకవర్గం ఇటీవల బ్యాం కుకు వెళ్లి ఆరా తీయగా అవి నకిలీ చలాన్లు అని తేల్చింది. ఈ విషయాన్ని అధికారులు, పాలకవర్గం బయటికి రాకుండా చూడడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని గ్రామపంచాయతీకి రా వాల్సిన మొత్తం బకాయిలు వసూలు చేయాలని నకిలీ చలాన్ల విషయంలో బాఽధ్యులందరిపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. కాగా నకిలీ చలాన్లపై కలెక్టర్‌ విచారణ చేసి నివేదిక అందజేయాలని డీపీవో ద్వారా ఇన్‌చార్జి ఎంపీడీవో సుధీర్‌కుమార్‌ను ఆదేశించారు. అయితే ఇన్‌చార్జి ఎంపీడీవో విచారణ చేపట్టకుండానే అన్ని సక్రమంగా ఉన్నట్లు జిల్లా అధికారులకు నివేదిక పంపడం గమనార్హం.

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం : శంకర్‌నాయక్‌, ఇన్‌చార్జి డీపీవో

కొండమల్లేపల్లి గ్రామపంచాయతీలో సంత కాంట్రాక్టర్‌ దూదిమెట్ల శ్రీనివాస్‌ నకిలీ చలాన్లు అందజేయడం సరికాదు. విచారణ జరిపి తగిన చర్యలు తీసకుంటామని తెలిపారు.

Updated Date - Apr 16 , 2026 | 11:43 PM