Share News

అందని ‘చేయూత’

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:38 AM

ఆపన్నుల ఆసరాకోసం ప్రవేశపెట్టిన చేయూత పింఛన్‌ పథకం కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌ పేరుకుపోయాయి. 2023 ఎన్నికల ముందు కాంర గెస్‌ ఇచ్చిన హామీని నేటికీ నెరవేర్చకపోవడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అందని ‘చేయూత’

ఏళ్ల తరబడి తప్పని నిరీక్షణ

జిల్లాలో 19,386 కొత్త దరఖాస్తులు

ఆగస్టు 2022 నుంచి కొత్త పింఛన్ల మంజూరు లేదు

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): ఆపన్నుల ఆసరాకోసం ప్రవేశపెట్టిన చేయూత పింఛన్‌ పథకం కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌ పేరుకుపోయాయి. 2023 ఎన్నికల ముందు కాంర గెస్‌ ఇచ్చిన హామీని నేటికీ నెరవేర్చకపోవడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోర్టల్‌లో కొత్త దరఖాస్తులకు ఆప్షనే కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదరువు లేని వారి జీవనానికి అందించే చేయూత పింఛన్లకోసం అర్హులైన ఆయావర్గాల ప్రజలు మూడున్నరేళ్లుగా నిరీక్షిస్తున్నారు. పింఛన్‌ పొందడానికి అర్హులైన వయో వృద్ధులు, వితంతు, దివ్యాంగులు, చేనేత, గీత, ఒంటరి మహిళ, డయాలసిస్‌, బీడీ కార్మికులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాటి మంజూరుకు అతీగతి లేదు. 2022 ఆగస్టు నుంచే అప్పటి ఆసరా పోర్టల్‌ నుంచి కొత్తగా దరఖాస్తులకు ఆప్షనే కనిపించకుండా పోయింది. అప్పటికే జిల్లా వ్యాప్తగా వేలాదిగా దరఖాస్తు లు పెండింగ్‌లో పేరుకుపోయాయి. అయితే 2023 ఎన్నికల ముందు పింఛన్ల మొత్తం పెంచుతామని, అర్హులైన వారందరికీ కొత్తగా మంజూరు చేస్తామని అప్పటి అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల హామీలు గుప్పించాయి. అయితే అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం రెండున్నరేళ్ల కాలం గడిచినా.. ఇప్పటివరకు అర్హులైన కొత్తవారికి పింఛన్లు మంజూరు అనే అంశం ఊసే ఎత్తడం లేదు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ కేటగిరీ ఫించన్లకోసం కొత్తగా దరఖాస్తులు 19,386 పెండింగ్‌లో ఉన్నాయి.

జిల్లాలో ప్రస్తుతం చేయూత పింఛన్లు 97,102

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుతం వివి ధ కేటగిరీల కింద 97,102 మంది తమ జీవనభృతికి భరోసాగా ప్రభుత్వం అందించే చేయూత పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతు, దివ్యాంగ, చేనేత, గీత, ఒంటరి మహిళ, డయాలసిస్‌, బీడీ కార్మికులు, వృద్ధ కళాకారులు ఉన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆసరా పింఛన్ల పథకంలో అప్పటి ప్రభుత్వం పింఛన్ల పెంచడంతో అభాగ్యులైన పేదవర్గాలకు వేడినీళ్లకు చలినీళ్లలా జీవనాధారంగా కూడా మారింది. వీరిలో వృద్ధులు, వితంతు, చేనేత, గీత, ఒంటరి మహిళ, డయాలసిస్‌ వంటి కేటగిరిలో నెలకు రూ.2,016 అందిస్తుండగా దివ్యాంగులకు రూ.4,016 అందజేస్తున్నారు. ఈ పింఛన్లు పొందుతున్న కేటగిరీలో ఎక్కువ సంఖ్యలో వృద్ధాప్య పింఛన్లు 35,738 మంది లబ్ధిదారులుండగా, వితంతు పింఛన్లు పొందుతున్న మహిళలు 36,119 మంది ఉన్నారు. గీత కార్మికులు 5,594, చేనేత కార్మికులు 3,025, బోధకాలు వ్యాధిగ్రస్థులు 500, డయాలిసిస్‌ రోగులు 2,222 మంది, ఒంటరి మహిళలు 2,476, బీడి కార్మికులు 915, దివ్యాంగులు 12,512 మంది లబ్ధిదారులు ఉన్నారు. చేయూత పింఛ న్లు పొందుతున్న కేటగిరీల్లో దివ్యాంగులకు రూ.6000కు పెంచుతామని, మిగతా కేటగిరీలోనూ రూ.2,016 నుంచి రూ.4000 పెంచుతామని ఆరు గ్యారంటీల్లో హామీలు గు ప్పించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను చూపుతూ ఎప్పటికప్పుడూ పెంపును వా యిదా వేసుకుంటూ వస్తున్నారు. పింఛన్లు పెంచడం మరిచిన ప్రభుత్వం కొత్తగా అర్హత సాధించిన లబ్ధిదారులను పథకంలో చేర్చి చేయూత అందించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

వృద్ధాప్య పింఛన్లు మాత్రమే జీవిత భాగస్వామికి బదిలీ

జిల్లాలో సాంఘిక భద్రత కల్పించే లక్ష్యంగా చేపట్టి న వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులతో పాటు వివిధ కేటగిరీలకు ఇచ్చే పింఛన్‌ పథకంలో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా వేలాది మంది మృతిచెందారు. వృద్ధాప్య పింఛన్‌ పొందుతున్న లబ్ధిదారులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి మాత్రం ఆ పింఛన్‌ 15నుంచి నెలరోజుల్లో బదిలీ చేస్తున్నారు. ఇందుకోసం చేయూత పోర్టల్‌లో సదుపాయం కల్పించారు. అయితే మిగతా వ్యక్తిగత కేటగిరీల్లో మరణించిన లబ్ధిదారులు సైతం వేలల్లో ఉన్నప్పటికీ, వారి స్థానంలో ఆయా కేటగిరీల్లో సైతం అర్హులైన కొత్తవారికి కూడా లబ్ది చేకూర్చడం లేదు. దీంతో ఆయా కేటగిరీల్లో అర్హతలుగల వ్యక్తులు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం తమకు చేయూత ఎప్పుడు అందిస్తుందా..? అని మూడున్నరేళ్లుగా నిరీక్షిస్తున్నారు.

వృద్ధాప్య ఫింఛన్‌ లేదు.. వితంతు రావడం లేదు

నా భర్తకు గీతకార్మికుడిగా ఆసరా పింఛన్‌ అందే ది. అయితే ఆయన వృద్ధాప్య పింఛన్‌కు అర్హుడైనప్పటికీ అప్పట్లో గీతకార్మికుడి కేటగిరీలో పింఛన్‌ పొందుతూ దానిలో నే కొనసాగాడు. ఆయన 2021లో మరణించా డు. అయితే ప్రస్తుతం ఆయన పింఛన్‌ నాకు బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నా. అయితే వృద్ధాప్య పింఛన్‌కు అర్హురాలినైనప్పటికీ.. నా భర్త గీతకార్మికుడి కేటగిరీలో ఉన్నందున నాకు బదిలీ చేయలేమంటున్నా రు. వృద్ధాప్య పింఛన్‌, వితంతు పింఛన్‌కు అర్హురాలైనప్పటికీ కొత్తగా ఆ కేటగిరీలో పిం ఛన్లను మంజూరుచేయడంలేదు. దీంతో అ యిదేళ్లుగా పింఛన్‌కోసం నిరీక్షిస్తూనే ఉన్నా. నా జీవనభృతికి ఏదైనా పింఛన్‌ ఇవ్వాలి.

- బోయిని అండమ్మ, మన్నెవారి పంపు, భువనగిరి మండలం

Updated Date - Mar 04 , 2026 | 12:38 AM