Share News

ఉమ్మడి జిల్లాలోనూ ‘యూనిక్‌’ బాధితులు

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:54 PM

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల ప్రజల సొమ్మును కొల్లగొట్టిన యూనిక్‌ మర్చంటైల్‌ లిమిటెడ్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ పంజా విసిరింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.60కోట్లకు పైగా బాధితులు నష్టపోయినట్లు సమాచారం.

ఉమ్మడి జిల్లాలోనూ ‘యూనిక్‌’ బాధితులు
డిపాజిట్‌ పత్రాలు చూపిస్తున్న బాధితులు

రూ.60కోట్లు నష్టపోయిన బాధితులు

భువనగిరి టౌన, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల ప్రజల సొమ్మును కొల్లగొట్టిన యూనిక్‌ మర్చంటైల్‌ లిమిటెడ్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ పంజా విసిరింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.60కోట్లకు పైగా బాధితులు నష్టపోయినట్లు సమాచారం. అధిక వడ్డీ, నెలకు, సంవత్సరానికి అధిక లాభాలు ఇస్తామని పలు రీతుల్లో పెద్దమొత్తంలో సేకరించారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించేందుకు యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలంలోని 206ఎకరాల భూమిని చూపించారు. అయితే ఆ భూమిని సంస్థ బాధ్యులు అగ్రిమెంట్‌ చేసిన వారికి బదులు మరో సంస్థకు విక్రయించింది. విషయం తెలుసుకున్న మొదటి సంస్థ భువనగిరి జిల్లా కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు వాయిదా కోసం యూనిక్‌ ఏజీఎం శుక్రవారం కోర్టుకు రానున్నారని రాష్ట్రంలోని పలుజిల్లాల నుంచి పెద్దసంఖ్యలో బాధితులు కోర్టుకు వచ్చారు. కానీ అతడు రాకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు.

ఉమ్మడి జిల్లాలో రూ. 60కోట్లు

యూనిక్‌ మర్చంటైల్‌ సంస్థ అప్పటివరకు ఆర్థిక వ్యవహారాలు నడిపిన తీరుతో విశ్వాసాన్ని పెంపొందించుకుంది. ఈ క్రమంలోనే పలు కేటగిరిలలో ఉద్యోగులను, ఏజెంట్లను నియమించుకొని ఆర్‌డీ, ఎఫ్‌డీలను సేకరించింది. కరోనా వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.60కోట్లకు పైగా నగదు సేకరించిందని బాధితులు పేర్కొంటున్నారు. ఇందుకోసం సుమారు 1000 మంది వరకు ఏజెంట్లు పనిచేశారంటున్నారు. ఈ క్రమంలో డిపాజిట్ల మెచ్యూరిటీ గడువు 2021లో ముగిసినా చెల్లింపునకు మొదటి రెండేళ్లు కరోనా సాకు, అనంతరం ఇతర సాకులు చూపించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి, నల్లగొండ పోలీ్‌సస్టేషనలో కూడా బాధితులు ఫిర్యాదులుచేశారు. ఇదిలా ఉండగా వేతనాలు, బోన్‌సల కోసం ఏజెంట్లు బంఽ దువులు, మిత్రులతో డిపాజిట్లు చేయించారు. కానీ ఆ సొమ్ము తిరిగి రాకపోవడంతో వారంతా ఏజెంట్లను నిలదీస్తున్నారు. దీంతో తమఇళ్ల వద్ద పంచాయితీలు, తగాదాలు నిత్యకృత్యమవుతున్నాయని ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం భువనగిరిలో జరిగిన సమావేశంలో బాధితులపక్షాన న్యాయపోరాటం చేస్తున్నామని, రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని వరంగల్‌కు చెందిన సామాజికకార్యకర్త పూజిత మిశ్రా అన్నారు. స్థానిక న్యాయవాది నాగారం అంజయ్య బీబీనగర్‌ మండలంలోని 206ఎకరాల భూమితో బాధితులకు న్యాయం జరిగేలా తనవంతు న్యాయ సహాయం చేస్తానన్నారు.

రూ.2 కోట్లు డిపాజిట్‌ చేయించా

యూనిక్‌ మర్చంటైల్‌ లిమిటెడ్‌ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి. మా బంధు మిత్రుల నుంచి రూ.2 కోట్లకు పైబడి డిపాజిట్‌ చేయించా. కానీ తిరిగి చెల్లింపులు లేకపోవడంతో వారితో రోజూ గొడవలు అవుతున్నాయి. న్యాయం కోసం నల్లగొండ, నార్కట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశా.

ఉప్పల శ్రీనివాస్‌ , నార్కట్‌పల్లి.

Updated Date - Apr 24 , 2026 | 11:54 PM