అనైతికం.. అసాంఘికం
ABN , Publish Date - Oct 07 , 2026 | 01:11 AM
జిల్లాలో వ్యభిచారం జోరుగా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేట పట్టణంతో పాటు కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మునిసిపాలిటీల్లోని శివారు కాలనీల్లోని నివాసాలతో పాటు పట్టణాల్లోని పలు లాడ్జీ ల్లో యథేచ్ఛగా ఈ దందా సాగుతోంది.
జోరుగా వ్యభిచారం
లాడ్జీలు, నివాసాల్లో సాగుతున్న వైనం
ఇతర ప్రాంతాల నుంచి యువతీ, యువకులు రాక
వ్యభిచారం కోసం ఇళ్లను అద్దెకు ఇస్తున్న కొందరు యజమానులు
(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట): జిల్లాలో వ్యభిచారం జోరుగా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేట పట్టణంతో పాటు కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మునిసిపాలిటీల్లోని శివారు కాలనీల్లోని నివాసాలతో పాటు పట్టణాల్లోని పలు లాడ్జీ ల్లో యథేచ్ఛగా ఈ దందా సాగుతోంది. కొంతమంది మహిళ లు, పురుషులు ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారాన్ని నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఏకాంతంగా గడపాలని కోరిక ఉన్న కొందరిని ఎంపి క చేసుకుని వారికి వాట్స్‌పలో యువతుల ఫొటోలు పం పి వారి గుట్టుగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కువగా పగటి వేళల్లోనే ఈ తంతు సాగుతున్నట్టు తెలుస్తోంది. రాత్రి సమయానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువతులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. జిల్లాలోని లాడ్జీల్లో పోలీసుల తనిఖీలు లేకపోవడంతో వాటి యజమానులు వ్యభిచారం కోసం జంటలకు గదులు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇతర ప్రాంతాల నుంచి రప్పించి
జిల్లాలో కేంద్రంతోపాటు కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి పట్టణాల్లో కొందరు మహిళలు పురుషుల సహాంతో వ్యభిచారం సాగిస్తున్నారు. ఈ పనులకు అంగీకారం తెలిపే యువతులు, మహిళల ఫొటోలను వాట్సాప్ ద్వారా విటులకు పంపుతున్నారు. ఆంధ్రా ప్రాంతంతో పాటు వరంగల్, ఖమ్మంతో పాటు జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు, జిల్లా కేంద్రానికి సమీపంలోని గ్రామాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కొన్ని లాడ్జీలు, కొన్ని నివాస గృహాల్లో సైతం ఈ దందా సాగుతోంది.
రూ.1,000 నుంచి రూ.15వేల వరకు
వ్యభిచార గృహ నిర్వాహకులు విటుల నుంచి యువతులను బట్టి ధర వసూలు చేస్తున్నారు.ఈమొత్తం రూ.1,000 నుంచి రూ.15వేలవరకు ఉంటోంది. పురుషు లు యువతులతో గడిపే సమయాన్ని బట్టి కూడా ధర నిర్ణయిస్తున్నారు. వ్యభిచార గృహంలో పురుషులకు అవసరమైతే మద్యం, బిర్యానీ కూడా అందుబాటులో ఉంచుతున్నారు.వాటికి అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారు.
ఇళ్లను అద్దెకు ఇస్తున్న యజమానులు
జిల్లాలో వ్యభిచారం కోసం సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల పట్టణాల్లోని కొందరు ఇంటి యజమానులు ఇళ్లను అద్దెకు ఇస్తున్నారు. తొలుత ఇంటిని అద్దెకు తీసుకునే సమయాల్లో వారి ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తారనే విషయం తెలియడం లేదు. కొన్ని రోజులు గడిచాక తెలిసినా కొందరు ఇం టి యజమానులు పట్టించుకోవడం లేదు. ఇంకా కొంద రు అయితే ఇంటి ఖర్చులకు డబ్బు వస్తుందనే ఆశతో పిల్లలు పాఠశాలలకు, భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయా ల్లో తెలిసిన మహిళలు, పురుషులతో ఏకాంతంగా గడిపేందుకు అవకాశం ఇస్తున్నారు. లాడ్జీల్లో అయితే వివాహమైన వారు కావడంతో ఎవరైనా చూస్తే ఇబ్బందులు కలుగుతాయని భావించి ఇలాంటి నివాసాలను ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకు ఇంటి మహిళ లు రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
అవివాహిత యువతీ, యువకులే ఎక్కువ
అవివాహిత యువతీ, యువకులు ఎక్కువగా జిల్లాలోని కోదాడ, సూర్యాపేట పట్టణాల్లోని లాడ్జీలను వారి ఏకాంతం కోసం ఎక్కువగా వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. లాడ్జీల యజమానులు కూడా యువతీ, యువకులకు గదులను అద్దెకు ఇస్తున్నారు. రోజు మొత్తం గదుల్లో గడపకుండా కొన్ని గంటలు మాత్రమే వారి ఉండి వెళ్తుండడంతో లాడ్జీల యజమానులు అలాంటి వారికే గదులు అద్దెకు ఇచ్చేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. లాడ్జీలకు వచ్చేవారిలో కొందరు మైనర్లు కూడా ఉంటున్నట్టు సమాచారం. సూర్యాపేటలోని ఎంజీరోడ్, అంజనాపురికాలనీ, ఖమ్మం క్రాస్‌రోడ్డు, కుడకుడరోడ్డు, జనగాం క్రాస్‌రోడ్డు, శ్రీరాంనగర్, సీతారాంపురం, విద్యానగర్, ఇందిరమ్మకాలనీల్లో ఎక్కువగా వ్యభిచారం సాగుతోందని సమాచారం. కోదాడలోని నయానగర్, కట్టకొమ్మగూడెం క్రాస్‌రోడ్డు సమీపంలోని కాలనీలు, ఖమ్మం క్రాస్‌రోడ్డు ప్రాంతంతో పాటు పలు లాడ్జీల్లో ఈ సాగుతున్నట్టు తెలుస్తోంది. కాగా సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ పట్టణాల్లో ఇటీవల పలువురు వ్యభిచారం చేస్తుండగా, సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. తాజాగా, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా, పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.
వ్యభిచార నిర్వహణపై ప్రత్యేక నిఘా : కొత్తపల్లి నరసింహ, ఎస్పీ
జిల్లాలో వ్యభిచారం జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. ఇటీవల సూర్యాపేటలో వ్యభిచారం నిర్వహించే వారిని పట్టుకున్నాం. గతంలో వ్యభిచారం నిర్వహించిన వ్యక్తులపైనా నిఘా పెడతాం. వ్యభిచార నిర్వహణకు లాడ్జీలు, ఇంటి యజమానులు గదులను అద్దెకు ఇవ్వవద్దు. యువతీ, యువకుల కదలికలపై పోలీ్‌సశాఖ ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. వ్యభిచారం చేసి పట్టుబడితే కేసు నమోదు కావడంతో పాటు సమాజంలో విలువ కూడా పోతుందనే విషయాన్ని అంతా గమనించాలి.