Share News

ట్రంప్‌ పేరును ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:16 AM

హైదరాబాద్‌ నగరంలో ప్రధాన రోడ్డు కు ప్రభుత్వం నామకరణం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేరును వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు.

ట్రంప్‌ పేరును ఉపసంహరించుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌.వీరయ్య

చౌటుప్పల్‌ టౌన, జూన 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంలో ప్రధాన రోడ్డు కు ప్రభుత్వం నామకరణం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేరును వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. చౌటుప్పల్‌ పట్టణంలోని కందాళ రంగారెడ్డి భవనలో బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ, తెలంగాణకు చెందిన ప్రముఖుల పేర్లను పెట్టాల్సిన రోడ్లకు విదేశీయుడైన సామ్రాజ్య వాది ట్రంప్‌ పేరు పట్టడం ఈ ప్రాంత ప్రజలకు అవమానకరమని అయన అన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ట్రంప్‌ పేరు పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి, నాయకులు ఎండీ.పాషా, శ్రీనివా్‌సచారి, గంగదేవి సైదులు, గోశిక కరుణాకర్‌, బోయ యాదయ్య, పల్లె మధు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 12:16 AM