Share News

రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్‌జెండర్‌ మృతి

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:20 AM

ఆమనగల్లు, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఆగి ఉన్న జీప్‌ను ఆటో ఢీ కొట్టడంతో ఒక ట్రాన్స్‌ జెండర్‌ మృతి చెందగా, ముగ్గురు ట్రాన్స్‌ జెండర్లకు గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్‌జెండర్‌ మృతి

ఆమనగల్లు, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఆగి ఉన్న జీప్‌ను ఆటో ఢీ కొట్టడంతో ఒక ట్రాన్స్‌ జెండర్‌ మృతి చెందగా, ముగ్గురు ట్రాన్స్‌ జెండర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, మాడుగుల ప్రధాన రహదారి ఆకుతోటపల్లి కాటన్‌ మిల్లు సమీపంలో బుఽధవారం రాత్రి జరిగింది. ఆమనగల్లు ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. నల్లగొండ జిల్లా డిండి మండలం కందుకూరుకు చెందిన ముద్దం ఆంజనేయులు అలియాస్‌ అమ్ము, వనపర్తి జిల్లా రేముద్ల తండాకు చెందిన కాట్రావత్‌ కమ్లి అలియాస్‌ రాజు, ఆమనగల్లుకు చెందిన వర్య్తావత్‌ తరుణ్‌ అలియాస్‌ అమ్ములు, అమిత్‌ నేజేత్‌ అలియాస్‌ హిర్‌ ట్రాన్స్‌జెండర్లు ఆమనగల్లు పట్టణంలోని విద్యానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. బుధవారం ఓ శుభకార్యం నేపథ్యంలో ఆకుతోటపల్లి గ్రామానికి ఆటోలో బయలుదేరారు. తిరిగి వస్తుండగా ఆకుతోటపల్లి కాటన్‌ మిల్లు సమీపంలో ఆగి ఉన్న మహేంద్ర కమాండర్‌ జీపును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ట్రాన్స్‌జెండర్లు అమ్ము, కమ్లి, తరుణ్‌, అమిత్‌ నేజేత్‌, ఆటో డ్రైవర్‌ విస్లావత్‌ కృష్ణ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నలుగురు ట్రాన్స్‌జెండర్‌లను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సకు ముందే అమ్ములు(26) మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Jul 02 , 2026 | 12:20 AM