Share News

జిల్లాలో పలువురు అధికారుల బదిలీ

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:20 AM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాకు చెందిన పలువురు జిల్లాస్థాయి అధికారులు వివిధ జిల్లాలకు బదిలీ అయ్యారు. జిల్లా రవాణాశాఖ అధికా రి సాయికృష్ణ, నాగర్‌కర్నూల్‌ డీటీవోగా బదిలీపై వెళ్లారు.

జిల్లాలో పలువురు అధికారుల బదిలీ

యాదాద్రి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాకు చెందిన పలువురు జిల్లాస్థాయి అధికారులు వివిధ జిల్లాలకు బదిలీ అయ్యారు. జిల్లా రవాణాశాఖ అధికా రి సాయికృష్ణ, నాగర్‌కర్నూల్‌ డీటీవోగా బదిలీపై వెళ్లారు. సం గారెడ్డి జిల్లా పటాన్‌ చెరువు ఎం వీఐ సంగం నరేష్‌ పదోన్నతిపై జిల్లా డీటీవోగా బదిలీపై రాను న్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కె.సత్యనారాయణ హన్మకొండ విద్యాశాఖ సహాయ సంచాలకుడిగా బదిలీపై వెళ్లగా, నల్లగొండ డీఈవో భిక్షపతి బదిలీపై ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.సాహితీ బదిలీపై వెళ్లగా, ఆమె స్థానంలో నల్లగొండ ఉపాధి కల్పనా అధికారి పద్మ వచ్చారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె.ధనుంజయ సంగారెడ్డికి బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో జడ్పీ డీప్యూటీ శ్రీనివాస్‌ అదనపు బాధ్యతలు చేపట్టారు. జిల్లా సహకార అధికారి మురళీరమ ణ జిల్లా ఆడిటర్‌గా బదిలీ అయ్యారు. డీసీవోగా వికారాబాద్‌ జిల్లాకు చెందిన అధికారి నాగార్జున బాధ్యతలు చేపట్టనున్నారు. భూ గర్భజల వనరుల డిప్యూటీ డైరెక్ట ర్‌ బదిలీపై వెళ్లా రు. ఆయన స్థానంలో జిల్లాకు ఇంకా ఎవరినీ కేటాయించలేదు. జిల్లా వ్యవసాయశాఖాధికారి కార్యాలయంలో ఏడీఏగా విధులు నిర్వహించిన నీలిమ పదోన్నతిపై హైదరాబాద్‌ మలక్‌పేట ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. భువనగిరి వ్యవసాయ సహాయ సంచాలకుడు బంటు వెంకటేశ్వర్లు జగిత్యాల జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ వాటర్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. యాదగిరిగుట్ట వ్యవసాయ సహాయ సంచాలకురాలు శాంతి నిర్మల నారాయణపేట ఆత్మ డిప్యూటీ ప్రాజె క్టు డైరెక్టర్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు.

డీఈవోగా భిక్షపతి

భువనగిరి టౌన్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖ అధికారిగా బి.భిక్షపతి నియమితులయ్యారు. ఇటీవల వరకు ఎఫ్‌ఏసీ హోదాలో డీఈవోగా పని చేసిన కే.సత్యనారాయణను విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ ఆయన స్థానంలో నల్లగొండ పనిచేస్తున్న భిక్షపతిని బదిలీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు నూతన డీఈవో శనివారం విధుల్లో చేరారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ ఏడీ ప్రశాంత్‌రెడ్డి కరీంనగర్‌ జిల్లా విద్యాశాఖ అధికారిగా పదోన్నతిపై వెళ్లారు. డీఈవో కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ నీలం శ్రీనివాస్‌ నల్లగొండకు బదిలీపై వెళ్లగా, అక్కడి నుంచి ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు యుగేందర్‌, క్రాంతికుమార్‌రెడ్డి ఇక్కడికి బదిలీపై వచ్చారు.

Updated Date - Jun 02 , 2026 | 12:20 AM