మళ్లీ మూడు నెలల రేషన్ ఒకేసారి
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:39 AM
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మూ డు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా అధికారులు మూడు నెలల కోటా రేషన్ పంపిణీకి సన్నాహాలు ప్రారంభిచారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకే విడతలో లబ్ధిదారులకు అందించేందు కు అవసమైన నిల్వ లు, రవాణా, పంపిణీకి పౌరసరఫరాల శాఖ కార్యాచరణ చేపట్టింది.
ఆగస్టు నుంచి అక్టోబరు కోటా పంపిణీకి సన్నాహాలు
జిల్లాలో 2.52లక్షల రేషన్‌కార్డులు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మూ డు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా అధికారులు మూడు నెలల కోటా రేషన్ పంపిణీకి సన్నాహాలు ప్రారంభిచారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకే విడతలో లబ్ధిదారులకు అందించేందు కు అవసమైన నిల్వ లు, రవాణా, పంపిణీకి పౌరసరఫరాల శాఖ కార్యాచరణ చేపట్టింది. గోదాముల నుంచి చౌక ధరల దుకాణాల డీలర్ల కు బియ్యం తరలింపు ముందస్తు సమాచారం, రవాణా, ఈ- పాస్ యంత్రాల సంసిద్ధతపై దృష్టి సారించారు. అదేవిధంగా రేషన్ డీలర్లు సైతం మూడు మాసాల బియ్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన స్థలా లను సమకూర్చుకుంటున్నారు.
జిల్లాలో 515 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 17 మండలాలు, 427 పంచాయతీలు, ఆరు మునిసిపాలిటీల్లోని ఈ దుకాణా ల్లో పరిధిలో 2,52,187 రేషన్ కార్డులు ఉన్నా యి. ఈ కార్డుల్లో 7,95,366 మం ది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో ఒక్కో లబ్ధిదారుడి కి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ప్రతీ నెల 5,036.0 17 మెట్రిక్‌టన్నుల బియ్యం ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మూడు మాసాల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించడంతో మూడు నెలలకు 15,108.081 మెట్రిక్ టన్నుల కోటా అసవరమవుతుందని పౌరసరఫరాలశా ఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం జిల్లాలో ఉన్న సన్న బియ్యం నిల్వలు, రాష్ట్రస్థాయి నుంచి అదనపు నిల్వలనిర్వహణకు చర్యలు చేపడుతున్నారు.
మూడు నెలల రేషన్ పంపిణీపై మిశ్రమ స్పందన
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత పథకంలోభాగంగా రేషన్ బియ్యాన్ని కొంత కాలంగా మూడు నెలల కోటాను లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ విధానాన్ని చేపట్టింది. అయితే జూన్ మాసంలో మాత్రం ఒక మాసం వరకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. మళ్లీ ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాలకు ఒకేసారి రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విధానంపై లబ్ధిదారులు, రేషన్ డీలర్లు, హమాలీలతో పాటు అధికారుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం వల్ల తరుచూ రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని లబ్ధిదారులు అభిప్రాయ పడుతున్నారు. రానున్నది పండుగల సీజన్, ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వ్యవసాయ పనులు మందగించాయి. గ్రామీణ ప్రాంతాల్లో సరైన పనులు లేని పేదవర్గాలకు ఆహార భద్రత కల్పించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో రేషన్ దుకాణాలను నిర్వహించే డీలర్లు మాత్రం మూడు నెలలకు ఒకేసారి పంపిణీకి అవసరమైన నిల్వ సామర్ధ్యం లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. అదే విధంగా ఒక్కో కార్డుదారుడి నుంచి ఈ-పాస్ యంత్రాల ద్వారా మూడు సార్లు అథంటికేషన్ తీసుకోవాల్సి ఉండటంతో పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోందంటున్నారు. పౌరసరఫరాలశాఖ అధికారులు జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దశలవారీగా బియ్యాన్ని చేరవేసే యోచనలో ఉన్నారు. ఈ-పాస్ యంత్రాల ద్వారా పారదర్శకంగా ప్రతీ కార్డుదారుడికి మూడు నెలల బియ్యం కోటా అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
మూడు నెలల విధానం రద్దు చేయాలి..
మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ విధానాన్ని రద్దు చేయాలని పౌరసరఫరాలశాఖ హమాలీల యూ నియన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఈమేరకు కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసి అనుబంధ రాష్ట్ర సివిల్‌సప్లయిస్ హమాలీల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహంచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మూడు నెలల రేషన్ కోటాను ఎగుమతి, దిగుమతిలో హమాలీలపై మోయలేని భా రం పడుతుందన్నారు. ప్రతీ నెల రేషన్ పంపిణీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీ ల బిల్లులను ప్రతీ నెల 1వ తేదీనే చెల్లించాలని డిమాండ్ చేశారు. భువనగిరి, చౌటుప్పల్‌లో సివిల్ సప్లయిస్ గోదాములు నిర్మించాలన్నారు. కూలీ రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై వెంటనే జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ‘ప్రజావాణి’ లో ఆర్డీవో ఎం.కృష్ణారెడ్డి, సివిల్‌సప్లయిస్ డీఎం హరికృష్ణకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.ఇమ్రాన్, నాయకులు శోభన్‌బాబు, జి.శ్రీనివాస్, పల్లె శ్రీనివాస్, జంగ నర్సయ్య, పాపగల్ల శంకరయ్య, పురుగుల రవి, గొరిగె శంకరయ్య, పిన్నం జగన్, స్వామి, కె.శ్రీను, యాదయ్య పాల్గొన్నారు.
జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ఇలా..
రేషన్ దుకాణాలు : 515
రేషన్‌కార్డులు : 2,52,187
యూనిట్లు : 7,95,366
నెలవారీ బియ్యం : 5,036.017 మెట్రిక్‌టన్నులు
మూడు నెలల కోటా : 15,108.051 మెట్రిక్‌టన్నులు